Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

 వారఫలితాలు తేదీ జనవరి 17 శుక్రవారం  నుండి 23 గురువారం 2020 వరకు    

 వారఫలితాలు తేదీ జనవరి 17 శుక్రవారం  నుండి 23 గురువారం 2020 వరకు    

వివరణ: డా. యం.ఎన్. చార్య ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు-శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం.తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశికి:-  ఈ వారం మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందులెదుర్కుంటారు. మంగళ, శనివారాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. రాబడికి మించిన ఖర్చులున్నా భారమనిపించవు. వాయిదా పడుతూ వస్తున్న మీ ప్రయాణం ఆకస్మికంగా సానుకూలమవుతుంది. వ్యాపార, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మనస్థిమితం అంతగా ఉండదు. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, విలువైన కానుకలు అందిస్తారు. విధి నిర్వహణలో ఏకాగ్రత వహించాలి. విద్యార్థులు తోటివారి కారణంగా మాటపడవలసి వస్తుంది. పత్రికా, వార్తా సంస్థల్లోని వారి శ్రమకు ఏ మాత్రం గుర్తింపు ఉండదు. బేకరి, స్వీట్స్, పండ్ల, పూల వ్యాపారులకు ఆశాజనకం. సన్నిహితులకు శుభాకాంక్షలందిస్తారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణల ఆలోచన వాయిదా వేయడం శ్రేయస్కరం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి:- ఈ వారం కొత్త వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. ఆత్మీయులతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. గురు, శుక్రవారాల్లో రుణదాతల ఒత్తిళ్ళు, అనుకోని ఖర్చులు మనస్థిమితం లేకుండా చేస్తాయి. మీ అశక్తతను కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. అవగాహన లేని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించడం మంచిది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కాక విసుగు కలిగిస్తాయి. మీ సంతానం మొండితనం చికాకు పరుస్తుంది. స్త్రీలకు టీవీ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల అభివృద్ధి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రముఖులకు శుభాకాంక్షలు, విలువైన కానుకలు అందిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, ఓర్పు ముఖ్యం. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించినట్లైతే సత్ఫలితాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. క్రయ విక్రయాలు జోరుగా సాగతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు, భూ తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సన్నిహితులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి:- ఈ వారం  విలాసాలు, నూతన వస్త్ర కొనుగోళ్ళకు ధనం బాగా వెచ్చిస్తారు. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏదో ఒక తప్పిదం జరిగే ఆస్కారం ఉంది. స్త్రీలు, అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించండి. ప్రముఖులకు శుభాకాంక్షలు శనివారం నాడు చేపట్టిన పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. ప్రముఖులకు శుభాకాంక్షలు, కానుకలందిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం తప్పవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. వృత్తుల వారి శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారంలో పునరాలోచన మంచిది. మీ ప్రత్యర్థుల విషయంలో ఏమరుపాటు కూడదు. పత్రికా సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. లీజు, ఏజెన్సీలు, నూతన పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశ సందర్శనలు అనుకూలిస్తాయి.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి:- ఈ వారం ఆత్మీయులు, సన్నిహితులతో ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. మీ మాటతీరు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక దానికి వ్యయం చేస్తారు. మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారి తీస్తుంది. స్త్రీలకు అయిన వారి నుంచి ఆసక్తికతమైన సమాచారం అందుతుంది. ఉద్యోగులు శుభాకాంక్షలు, విలువైన బహుమతులు అందించి అధికారులను ప్రసన్నం చేరుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ఆస్తి పంపకాల వ్యవహారం సానుకూలంగా పరిష్కారమవుతుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ప్రైవేట్ సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. ప్రింటింగ్ రంగాల వారికి టెక్నీషియన్లతో సమస్యలు తప్పవు. ముఖ్యమైన పత్రలు, రసీదులు అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశాలు సందర్శనలు అనుకూలిస్తాయి.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

సింహరాశి:- ఈ వారం ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు. మీ పనులు, కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఏ వ్యక్తినీ తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. కుటుంబ అవసరాలు, ఇతరత్రా ఖర్చులు అధికమవుతాయి. మొండి బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని భంగపాటుకు గురవుతారు. స్త్రీలు సాహిత్య, కళా రంగాల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకోవాల్సి వస్తుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెలకువ అవసరం. కొన్ని అనుకోని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు ప్రారంభిస్తారు. దైవ కార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. రాజీ మార్గంలో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి:- ఈ వారం  విదేశాల్లోని ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. కుటుంబ, ఆర్థిక ఆరోగ్య సమస్యలు క్రమంగా మెరుగుపడుతాయి. మీ యత్నాలకు సన్నిహితులు సహాయ సహకారాలందిస్తారు. ఏ విషయంలోను ఏకపక్ష నిర్ణయం మంచిది కాదని గమనించండి. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఒక వ్యవహార సానుకూలతకు ధనం బాగా వ్యయమవుతుంది. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. ఆది, సోమవారాల్లో ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించి భంగపాటుకు గురవుతారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త విషయాలు గ్రహించడంతో పాటు అనుభవం గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులతో ముచ్చటిస్తారు, క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వస్త్ర వ్యాపారులకు ఒత్తిడి, పనిభారం అధికం. ప్రింటింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. మీ వాహనం ఇతరులకివ్వడం మంచిది కాదు. దైవకార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి:- ఈ వారం అభిరుచికి తగిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు పెంచుకుంటారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మీయుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రావలసిన ధనం అనుకోకుండా చేతికందుతుంది. ఒక స్థిరాస్తి విక్రయించే ఆలోచన విరమించుకోవడం మంచిది. చేపట్టిన పనులు ఎంతకీ పూర్తి కాక విసుగు కలిగిస్తాయి. మంగళ, బుధవారాల్లో మీ అలవాట్లు, బలహీనతలను అదుపులో ఉంచుకోవడానికి యత్నించండి. మితిమీరిన మీ ప్రవర్తన, మాటతీరు ఇబ్బందులకు దారితీస్తాయి. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి నిరుత్సాహం తప్పదు. స్త్రీలపై దుస్వప్నాలు, శకునాల ప్రభావం అధికం. కళ, క్రీడ, సంగీత, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైన ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి:- ఈ వారం ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసిన సహాయానికి ప్రశంసలు అందుకుంటారు. మీ పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక దానికి వ్యయం చేయవలసి వస్తుంది. గురు, శుక్రవారాల్లో అయిన వారు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులెదుర్కుంటారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడుల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయడం శ్రేయస్కరం. స్త్రీల మాటకు ఆశించిన స్పందన లేకపోగా విమర్శలెదురవుతాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. వాహనం నిదానంగా నడపటం మంచిది. ఆస్తి వివాదాలు, భూ తగాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం, ఆకస్మిక స్థాన చలనం వంటి పరిణామాలున్నాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

ధనుస్సురాశి:- ఈ వారం విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయుల నుంచి శుభాకాంక్షలు, కానుకలు అందుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. శనివారం నాడు ఏ విషయంలోను మనస్థిమితం ఉండదు. సమయానికి సహకరిచని మిత్రుల స్వభావం నిరుత్సాహం కలిగిస్తుంది. నూతన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు, అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం కూడదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక పొరపాటు జరిగే ఆస్కారం ఉంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలించవు. పుణ్యక్షేత్రాల సందర్శనలు ప్రశాంతంగా సాగుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి:- ఈ వారం వ్యవహారాలు, కార్యసాధనలో ప్రతికూలతలే అధికం. మీ యత్నాలు ఆశించినంత చురుకుగా సాగవు. ఆత్మీయులు సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆది, సోమవారాల్లో కొన్ని సందర్భాల్లో తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. ఖర్చులు అధికం. మీ అవసరాలు ఏదో విధంగా గడిచిపోగలవు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం, చీటికి మాటికి కలహాలు చోటు చేసుకుంటాయి. స్త్రీలు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం క్షేమదాయకం. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించినట్లైతే సత్ఫలితాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన పరిష్కారం కావు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం ఉత్తమం.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .

కుంభరాశి:- ఈ వారం ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు తగినట్టుగానే ఉంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పట్టుదలతో శ్రమించిన మొండి బాకీలు వసూలు కాగలవలు. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. స్త్రీలకు టీవీ కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మంగళ, బుధవారాల్లో చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగవు. వ్యాపారాల్లో అనుభవం గడించడంతో పాటు కొత్త కొత్త ప్రణాళికలు అమలుపరుస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యమైన వ్యవహారాలు, నిర్ణయాల విషయంలో తొందరపాటుతనం కూడదు. దైవదర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. పరిచయస్తుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి:- ఈ వారం వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూకు సంబంధించిన అనుమతి లభిస్తుంది. కుటుంబీకులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. అందరితో సఖ్యతగా మెలిగి మీ పనులు చక్కబెట్టుకుంటారు. దంపతుల అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ పొరపాట్లు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆదివారం నాడు మీ కార్యక్రమాలు తలపెట్టిన పనులు అనుకున్న విధంగా సాగవు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఖర్చులు పెరిగిగా ప్రయోజనకరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. స్త్రీలకు అయిన వారి ఆకస్మిక రాక సంతోషం కలిగిస్తుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు గ్రహిస్తారు. స్త్రీలకు అయిన వారి ఆకస్మిక రాక సంతోషం కలిగిస్తుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బంధువులు చూపిన ఆదరాభిమానాలు మిమ్ములను ఆకట్టుకుంటాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు అధికారులు సిఫార్సు చేస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .

 

 వారఫలితాలు తేదీ జనవరి 17 శుక్రవారం  నుండి 23 గురువారం 2020 వరకు     Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *