Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 13 ఏప్రిల్ 2024 

ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 13 ఏప్రిల్ 2024 

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్.  ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీపేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాల అందుకుంటారు. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖులు నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు గృహమున చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి,  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృత మవుతాయి. మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో  వాహన ఇబ్బందులు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 13 ఏప్రిల్ 2024  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *