Top Ad unit 728 × 90

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ: గేట్ స్కోర్ చాలు.

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ: గేట్ స్కోర్ చాలు.

 

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 

గేట్ 2022 (GATE 2022) లేదా గేట్ 2023 (GATE 2023) లేదా గేట్ 2024 (GATE 2024) స్కోర్ ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్పీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ npcilcareers.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఏప్రిల్ 30 లాస్ట్ డేట్...

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 10న ప్రారంభమైంది. 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

 

ఖాళీల వివరాలు

మెకానికల్: 150 పోస్టులు

కెమికల్: 73 పోస్టులు

ఎలక్ట్రికల్: 69 పోస్టులు

ఎలక్ట్రానిక్స్: 29 పోస్టులు

ఇన్ స్ట్రుమెంటేషన్: 19 పోస్టులు

సివిల్: 60 పోస్టులు

 

అర్హతలు

బీఈ/బీటెక్ /బీఎస్సీ (ఇంజినీరింగ్ )/5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో కనీసం 60 శాతం మార్కులతో యూనివర్సిటీ/డీమ్డ్ యూనివర్సిటీ లేదా ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన ఇన్ స్టిట్యూట్ నుంచి మెకానికల్, కెమికల్, సివిల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ విభాగాల్లో ఏదో ఒక విభాగం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించిన విభాగంలోనే చెల్లుబాటు అయ్యే గేట్-2022 (GATE 2022) లేదా గేట్-2023 (GATE 2023) లేదా గేట్-2024 (GATE 2024) స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.

 

ఎంపిక విధానం

గేట్ 2022, గేట్ 2023, గేట్ 2024 స్కోర్ల ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూ కు 1:12 రేషియోలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. మెడికల్ ఫిట్ నెస్ కు లోబడి పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

 

దరఖాస్తు ఫీజు

జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ ఫీజు కింద రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, డీవోడీపీకేఐఏ (విధుల్లో ఉండగా మరణించిన త్రివిధ దళాలకు చెందిన సైనికుల కుటుంబ సభ్యులు), మహిళా దరఖాస్తుదారులు, ఎన్ పీసీఐఎల్ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్పీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.

 

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ: గేట్ స్కోర్ చాలు. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *