Top Ad unit 728 × 90

బుమ్రా బౌలర్‌ నం. 1, ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌

బుమ్రా బౌలర్‌ నం. 1, ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌

 

-ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ పేసర్‌గా రికార్డు

-మూడో ప్లేస్‌కు పడిన అశ్విన్‌

 

దుబాయ్‌: టీమిండియా స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా... మరో అరుదైన ఘనత అందుకున్నాడు.

 

ఐసీసీ మెన్స్‌ టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 'నంబర్‌వన్‌' ర్యాంక్‌ను సాధించాడు. దీంతో ఇండియా తరఫున టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న తొలి పేసర్‌గా రికార్డు సృష్టించాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో మూడు ప్లేస్‌లు ఎగబాకిన బుమ్రా 881 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

 

విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 9 వికెట్లు తీయడం అతని ర్యాంక్‌ మెరుగుపడటానికి బాగా దోహదం చేసింది. 11 నెలలుగా టాప్‌ ప్లేస్‌లో కొనసాగిన ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (841) మూడో ప్లేస్‌కు పడిపోయాడు. రెండో టెస్ట్‌లో కేవలం మూడే వికెట్లు తీయడంతో రవి అశ్విన్‌ రెండు ప్లేస్‌లు కోల్పోవాల్సి వచ్చింది. సౌతాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ (851) రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతుండగా, ఆసీస్‌ పేసర్లు ప్యాట్‌ కమిన్స్‌ (828), జోష్‌ హేజిల్‌వుడ్‌ (818) నాలుగు, ఐదో ర్యాంక్‌లో ఉన్నారు.

 

నాలుగో బౌలర్‌గా...

ఓవరాల్‌గా ఇండియా తరఫున టెస్ట్‌ల్లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సాధించిన నాలుగో బౌలర్‌గా 30 ఏళ్ల బుమ్రా రికార్డులకెక్కాడు. గతంలో అశ్విన్‌, రవీంద్ర జడేజా, బిషన్‌ సింగ్‌ బేడీ టాప్‌ ర్యాంక్‌ను సాధించారు. అయితే ఈ ముగ్గురూ స్పిన్నర్లు కావడం విశేషం. రేటింగ్‌ పాయింట్ల పరంగా చూస్తే అశ్విన్‌ (904), జడేజా (899)... బుమ్రా (881) కంటే ముందున్నారు.

 

మార్చి 2017లో అశ్విన్‌-జడ్డూ సంయుక్తంగా టాప్‌ ప్లేస్‌లో నిలిచిన గుర్తింపును కూడా పొందారు. టీమిండియా తరఫున 34 టెస్ట్‌లు ఆడిన బుమ్రా... గత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎప్పుడు కూడా మూడో ర్యాంక్‌ దాటలేదు. ఓవరాల్‌ కెరీర్‌లో 10 సార్లు ఐదు వికెట్ల హాల్‌ సాధించిన ఈ ముంబైకర్‌ 2024లోనే రెండుసార్లు ఈ ఘనత సాధించాడు.

 

ఈ క్రమంలో టెస్టుల్లో వేగంగా150 వికెట్లు పడగొట్టిన ఇండియా పేసర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఇక, బుమ్రా కంటే ముందు లెజెండరీ పేసర్ కపిల్ దేవ్‌ అత్యధికంగా రెండో ర్యాంక్ అందుకున్న ఇండియా ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు 1979-1980లో మూడో నెలల పాటు రెండో ప్లేస్‌లో ఉన్న కపిల్ టాప్ ర్యాంక్ మాత్రం సాధించలేకపోయాడు.

 

యశస్వి 37 స్థానాలు పైకి...

యంగ్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (632) ఐసీసీ బ్యాటర్లలో తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. ఇంగ్లండ్‌పై డబుల్‌ సెంచరీ చేయడంతో అతను ఏకంగా 37 ప్లేస్‌లు ఎగబాకి 27వ ర్యాంక్‌లో నిలిచాడు. గిల్‌ 14 ప్లేస్‌లు మెరుగుపడి కెరీర్‌ బెస్ట్‌ 38వ ర్యాంక్‌లో నిలిచాడు. విరాట్‌ కోహ్లీ (760) ఒక్క ప్లేస్‌ కిందకు దిగి ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. రిషబ్‌ పంత్‌ (714), రోహిత్‌ (702) వరుసగా 12, 13వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. కేన్‌ విలియమ్సన్‌ (864) నంబర్‌వన్‌ ర్యాంక్‌లో మార్పులేదు. టెస్ట్‌ టీమ్‌ ర్యాంకింగ్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ఇండియా... వన్డే, టీ20ల్లో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

 

కోహ్లీ తర్వాత బుమ్రానే...

కింగ్‌ కోహ్లీ తర్వాత అన్ని ఫార్మాట్లలో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న రెండో ఆసియా ప్లేయర్‌గా బుమ్రా నిలిచాడు. ఓవరాల్‌గా నాలుగో క్రికెటర్‌గా రికార్డుల్లో చోటు సంపాదించాడు. మాథ్యూ హెడెన్‌, రికీ పాంటింగ్‌, కోహ్లీ ముందున్నారు. ఇక క్రికెట్‌ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో టాప్‌ ర్యాంక్‌ సాధించిన తొలి బౌలర్‌గా, తొలి పేసర్‌గా బుమ్రా అతి పెద్ద రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

 

బుమ్రా బౌలర్‌ నం. 1, ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *