Top Ad unit 728 × 90

చరిత్ర సృష్టించనున్న సునీల్‌ నరైన్‌


చరిత్ర సృష్టించనున్న సునీల్‌ నరైన్‌

 

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 29) జరుగబోయే మ్యాచ్‌తో కేకేఆర్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ చరిత్ర సృష్టించనున్నాడు.

 

ఈ మ్యాచ్‌తో నరైన్‌ టీ20ల్లో 500 మ్యాచ్‌ల మైలురాయిని తాకబోతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కేవలం ముగ్గురు మాత్రమే నరైన్‌కు ముందు ఈ మైలురాయిని తాకారు.

 

వీరిలో కీరన్‌ పోలార్డ్‌ అందరికంటే ఎక్కువగా 660 మ్యాచ్‌లు ఆడగా... డ్వేన్‌ బ్రావో 573, షోయబ్‌ మాలిక్‌ 542 మ్యాచ్‌లు ఆడారు. టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్‌లో చేరబోతున్న నరైన్‌... ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడి 536 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 3736 పరుగులు చేశాడు. 2011లో టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నరైన్‌ చాలా రికార్డుల్లో భాగంగా ఉన్నాడు.

 

మ్యాచ్‌ విషయానికొస్తే... రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడనున్నాయి. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉండగా... ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్‌ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *