Top Ad unit 728 × 90

నిమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...!


నిమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...!

 

హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పటల్స్ లలో నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషయిన్, రిసెర్చ్ అసిస్టెంట్, సైంటిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Job Notification) పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

 

ఖాళీల వివరాలు:

S.No.

పోస్టు

ఖాళీలు

1.

డేటా ఎంట్రీ ఆపరేటర్

1

2.

లేబొరేటరీ టెక్నీషియన్

2

3.

రిసెర్చ్ అసిస్టెంట్

1

4.

సైంటిస్ట్-బి

1

 

మొత్తం:


 

 

ఎలా అప్లై చేయాలంటే..

Step 1:అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://nims.edu.in/index ఓపెన్ చేయాలి.

Step 2:అనంతరం నోటిఫికేషన్స్ విభాగంలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3:అనంతరం Notification for Scientist-B - Research Assistant ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4:తర్వాత అప్లికేష్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

Step 5: ఆ ఫామ్ లో కావాల్సిన వివరాలను నింపాలి.

Step 6:ఆ అప్లికేషన్ ఫామ్ ను The Dean, Nizams Institute Of Medical Science చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

Step 7:దరఖాస్తులు అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 4లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *