Top Ad unit 728 × 90

అల్లు అర్జున్ రష్మిక పుష్ఫ షూటింగ్ ప్రారంభం అయ్యేది అపుడే...!


అల్లు అర్జున్ రష్మిక పుష్ఫ షూటింగ్ ప్రారంభం అయ్యేది అపుడే...!

 

ఇయర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ కమర్షియల్ హిట్ ని సాధించి తన సత్తా ఏమిటో నిరూపించాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని భారీగా పెంచేసింది. సినిమా తర్వాత బన్ని కొంత గ్యాప్ ఇచ్చి సుకుమార్ దర్శకత్వలో 'పుష్ప'సినిమాకు ఓకే చెప్పాడు. సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో సినిమా విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్గా చేస్తోంది. ఇక సినిమా అల్లు అర్జున్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఇద్దరీ కాంబినేషన్లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా ఇది మూడవ చిత్రం.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్లో కనబడుతూ.. లారీ డ్రైవర్గా అదరగొడుతాడని తెలుస్తోంది. ఇక సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఇక సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది.సుకుమార్ 'వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో' రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సినిమాను కేరళ అడవుల్లో కాకుండా విశాఖ పట్నం, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవం అడవుల్లో సినిమాను షూట్ చేయనున్నట్టు సమాచారం. షెడ్యూల్లో అల్లు అర్జున్తో పాటు రష్మికతో పాటు పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *