కాంగోలో పడవ మునిగి 80 మంది కానరాని లోకాలకు...! Video Clip
కాంగోలో పడవ మునిగి 80 మంది కానరాని లోకాలకు...! Video Clip
కాంగో (Congo) లో ఘోర పడవ ప్రమాదం (Boat accident) జరిగింది. దక్షిణ కివు (South Kivu) ప్రావిన్స్‌లోని మినోవా (Minova) పట్టణం నుంచి గోమా (Goma) పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్ లోడ్ (Over load) కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది.
కివూ సరస్సు (Kivu lake) లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందిని రెస్క్యూ బృందాలు (Rescue teams) కాపాడాయి. ఈ పడవ ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిలో కొందరు ఈదుతూ ఒడ్డుకు రాగా, కొందరిని రక్షణ దళాలు కాపాడాయని దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్ జాక్వెస్ పురుషి మీడియాకు తెలిపారు. అయితే మరణాలకు సంబంధించి కచ్చితమైన సంఖ్య తెలియడానికి మరో రెండు రోజులు పడుతుందన్నారు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని, గల్లంతైన 78 మందిలో అందరి మృతదేహాలు లభ్యం కాలేదని అన్నారు.
Click Here: హనుమాన్ మంత్రం | Hanuman Mantra
కాంగో ప్రభుత్వ బలగాలకు, M23 తిరుగుబాటుదారులకు మధ్య గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు. దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ప్రమాదం జరిగింది. కాగా యుద్ధమే ఈ ప్రమాదానికి కారణమని పలువురు మండిపడుతున్నారు.