తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం... ఇద్దరు మృతి
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం... ఇద్దరు మృతి
తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం రెండవ ఘాట్‌రోడ్డులో చివరిమలుపు వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా కిందకి వేగంగా వస్తున్న బస్సు కింద మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని... క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీసేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు.
కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని తమిళనాడుకు చెందిన దంపతులు గా గుర్తించారు. కాగా ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని... ఘట్ రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం... ఇద్దరు మృతి
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating: