Top Ad unit 728 × 90

కరివేపాకుని ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

కరివేపాకుని ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

 

కూరల్లో కరివేపాకు వేయగానే దానిని తీసి పక్కన పెట్టేస్తారు. కానీ, ఇప్పుడు చెప్పే లాభాల గురించి చెబితే ఏంచక్కా తింటారు. అవేంటో తెలుసుకోండి.

 

కరివేపాకు... దీనిని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ నుంచి బ్యూటీ బెనిఫిట్స్ వరకూ ఎన్నో లాభాలున్నాయి. వీటిని తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలున్నాయి. పచ్చి కరివేపాకుని నమిలితే చాలా లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

 

ఎముకల బలానికి...

కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎలుకల ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది.

 

కిడ్నీలకు మందుగా...

కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడపున కరివేపాకుని తింటే మూత్రిపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలిగి వాటి పనితీరు మెరుగవుతుంది.

 

ఇమ్యూనిటీ...

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్రాము పచ్చి కరివేపాకు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కరివేపాకులో ప్రోటీన్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఇమ్యూనిటీ బలంగా మారతుంది. ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.

 

కొలెస్ట్రాల్‌ని తగ్గించడం...

కరివేపాకు తింటే LDL అనే చెడు కొలెస్ట్రరాల్ తగ్గుతుంది. దీంతో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గితే బీపి కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు తగ్గి హార్ట్ హెల్త్ బాగుంటుంది.

 

మలబద్ధకానికి మందుగా...

కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. కొందరికీ అజీర్ణం కారణంగా విరోచనాలు అవుతాయి. కరివేపాకుని పచ్చిగా తింటే ఈ సమస్య దూరమవుతుంది. అయితే, ఎక్కువగా తింటే మాత్రం డయేరియా వస్తుంది.

 

జుట్టు బలానికి...

జుట్టు రాలడానికి కారణం కుదుళ్ళు ఆరోగ్యంగా లేకపోవడమే... ఇందుకు ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం. ఈ రెండు లోపాల కారణంగా జుట్టు రాలుతుంది. అయితే, కరివేపాకు తింటే ఈ సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

 

కరివేపాకుని ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *