Top Ad unit 728 × 90

తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ...!

తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ...!

 

హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తెలంగాణలో ఎండలు... దంచికొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 43 డిగ్రీల మార్క్ ను దాటాయి ఉష్ణోగ్రతలు.

 

ఇవాళ ఉదయం నుంచే ఉక్కపోత వాతావరణం... మొదలవుతోంది. దీంతో రాబోయే ఐదు రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉండనున్నాయట. దీంతో రాబోయే ఐదు రోజుల పాటు బయటకు రాకుండదని ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అటు నేటి నుంచి 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ... ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాడ్పుల ముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి కొన్ని జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల మేర పెరగనున్నాయి ఉష్ణోగ్రతలు. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి రాత్రిపూట ఉష్ణోగ్రతలు. ఎండల తీవ్రతతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది ఐఎండీ.

 

తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *