Top Ad unit 728 × 90

కేసీఆర్‌ నేషనల్ పాలిటిక్స్‌కు బిగ్ బ్రేక్...!

కేసీఆర్‌ నేషనల్ పాలిటిక్స్‌కు బిగ్ బ్రేక్... మహారాష్ట్ర నేతల ఝలక్!

 

గులాబీ అధినేతకు మహారాష్ట్ర నేతలు షాక్ ఇస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇవ్వకపోవడం, కనీసం వారితో మాట్లాడకపోవడం, సమయం కూడా ఇవ్వకపోవడంతో కారు దిగేందుకు సిద్ధమయ్యారు.

 

బీఆర్ఎస్ పార్టీని అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఎత్తుకున్నారు. పంజాబ్, హర్యానాలో రైతులకు సాయం, ఒడిస్సా, ఏపీ, యూపీ, మధ్యప్రదేశ్, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు.

 

పలు రాష్ట్రాలకు చెందిన నేతలను కారెక్కించారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఎక్కువగా తెలుగు ప్రజలు ఉండటంతో తొలుత ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసేందుకు సభలు సైతం నిర్వహించారు. ఆకర్షితులై ఇద్దరు మాజీ ఎంపీలు, 15 మంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మేయర్లు, కౌన్సిలర్లు సైతం చేరారు. నాందేడ్‌లో సొంత భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసి మద్దతు దారులతో కలిసి 300లకు పైగా సర్పంచ్, వార్డు సభ్యులను కైవసం చేసుకున్నారు. నాగ్‌పూర్ డివిజన్‌లోని భండారా జిల్లాలో అత్యధికంగా 20, విదర్భ, షోలాపూర్‌లోని 15 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20 లక్షలకు పైగా సభ్యత్వాలు చేశారు.

 

పోటీపై క్లారిటీ ఇవ్వని గులాబీనేత

పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో పోటీచేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. కానీ త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో పోటీపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. పది రోజులుగా కేసీఆర్‌ను కలిసేందుకు నేతలు యత్నిస్తున్నట్లు సమాచారం. కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని చెబుతున్నారు. రాష్ట్ర ఇన్‌చార్జి వంశీధర్ రావు సైతం ఫోన్లకు అందుబాటులోకి రాకపోవడంతో మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే మహారాష్ట్రలో కారు ఖాళీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే మహారాష్ట్ర బీడ్ జిల్లా ఇన్‌చార్జిగా పనిచేస్తున్న దిలీప్ గోరే ఈ నెల18న బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

 

వైరల్‌గా మారిన ఆడియో

కేసీఆర్‌పై ఆవేదనతో మహారాష్ట్ర నేతలు ఆడియో పంపారు. ఆ ఆడియో రాజకీయ వర్గాల్లో వైరల్‌గా మారింది. 'మహారాష్ట్రలో పార్టీ విస్తరిస్తామని మమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ పాలన తీసుకువస్తామన్నారు. కమిటీలను ఏర్పాటు చేశారు. మీ మాటలు నమ్మి ఇతర పార్టీల నుంచి మేం బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాం. పార్టీ విస్తరణకు రాత్రింభవళ్లు కష్టపడ్డాం. పార్టీ సభలకు సొంతంగా ఖర్చుపెట్టుకున్నాం. కేడర్‌కు ఏం సమాధానం చెప్పాలి.

 

మాణిక్ కధం, శంకరన్న డేంగే... ఇంటికి పోయి ప్రజలు ఆగ్రహంతో నిలదీస్తున్నారు. కలిసేందుకు కనీసం మాకు అవకాశం ఇవ్వడం లేదు. కనీసం మా ఫోన్‌లు లిఫ్ట్ చేయడం లేదు. ఇదేనా మీ పార్టీ పద్ధతి'... అంటూ ఆడియోను పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కల్వకుంట్ల వంశీధర్ రావుకు పంపారు. కేసీఆర్ నుంచి రిప్లై రాకుంటే రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు.

 

కేసీఆర్‌ నేషనల్ పాలిటిక్స్‌కు బిగ్ బ్రేక్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *