తక్షణమే సినీ కార్మికులతో చర్చలు జరపండి: మంత్రి తలసాని
తక్షణమే సినీ కార్మికులతో చర్చలు జరపండి: మంత్రి తలసాని
హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం ముందు సినీ కార్మికులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
ఆదర్శ్‌నగర్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
''కరోనా నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమాల చిత్రీకరణలు లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. తక్షణమే కార్మిక సంఘాలతో ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచి చూడొద్దు. సమస్య రెండు మూడురోజుల్లో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా'' అని తలసాని అన్నారు.
తక్షణమే సినీ కార్మికులతో చర్చలు జరపండి: మంత్రి తలసాని
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
