SSCలో 70 వేల ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్... SSCలో 70 వేల ఉద్యోగాలు
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు SSC తెలిపింది. నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులు SSC.NIC.IN వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చంది. కాగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని గతవారం ప్రధాని మోదీ వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో SSC ఉద్యోగాల భర్తీని ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
SSCలో 70 వేల ఉద్యోగాలు
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
