Top Ad unit 728 × 90

District News :

ఈరోజు మీ రాశిఫలాలు: మంగళవారం 07 సెప్టెంబర్ 2021

ఈరోజు మీ రాశిఫలాలు: మంగళవారం 07 సెప్టెంబర్ 2021

 

మేష రాశి: మీరు ఊహిస్తున్న ఫలితాలు రాకపోవచ్చు. ఆత్మ విశ్వాసంతో ఉండండి. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. దుబారా ఖర్చులను నివారించండి. కుటుంబంలో కొన్ని ముఖ్య విషయాలను మీ భార్య భర్తలు తెలివిగా పరిష్కరించుకోండి. స్నేహితులతో అనవసర బాతాఖానీ వలన సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు గొడవ పడటం మానేసి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

 

వృషభ రాశి: నిరాశను వదిలివేయండి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. అనుకున్న కార్యాన్ని సాధించాలంటే ఆత్మవిశ్వాసం పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో పరుషంగా మాట్లాడకండి. దాని వలన వారు హర్ట్ అవుతారు మరియు ఇద్దరి దూరాలు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. కళా రంగంలోని వారికి పేరు ప్రఖ్యాతులు. ఆదాయ వ్యవహారాలు పర్వాలేదు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు అందరితో ఆనందంగా గడపటం వలన ఆరోగ్యం బ్రహ్మాండం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఇది ఒక తీపి గుర్తు.

 

మిధున రాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. గుర్తుంచుకోండి అన్ని కష్టాలకు చిరునవ్వే దివ్యౌషధం. ప్రేమికులు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. సమయం వృధా అయ్యే వ్యాపకాలను వదిలిపెట్టండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన భవిష్యత్తులో విజయాలు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రత్యేకమైన మరియు ఆనందకరమైన రోజు.

 

కర్కాటక రాశి: ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి చూపిస్తారు. దైవ ప్రార్ధన వలన మానసిక బలం మరియు ప్రశాంతత. ఈ జీవితం మీకు దేవుడిచ్చిన వరం. అది గుర్తించండి. ప్రతి విషయానికి విచారం వలన ఉపయోగం లేదు. ఆఫీసు పనులలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు అందుకని జాగ్రత్తగా పనులు పూర్తి చేయండి. ఆదాయం బాగున్నప్పటికీ అనుకోని ఖర్చులు అధికం అవటం వలన మానసిక అశాంతి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పెద్ద వారితో కొంత సమయం గడపండి. ఎలర్జీ వలన చర్మ సంబంధ వ్యాధులు. ఈ రాసలీలకే మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రత్యేకమైనది మరియు ఆనందకరమైన రోజు.

 

సింహరాశి: ఉజ్వలమైన ఎదుగుదలకు మీరు మరింత కష్టపడాలి. అనుకున్న కార్యాలను సాధించాలంటే ఆశావహ దృక్పథం తప్పనిసరి. ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్న రుణం మంజూరు అవుతుంది. మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేసి ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆఫీస్ పనులలో తోటి ఉద్యోగులు మరియు సీనియర్ల సహాయం లభిస్తుంది.

 

కన్య రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. బయట భోజనం వలన అజీర్తి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు భవిష్యత్తులో లాభిస్తాయి. ఆఫీసులో అదనపు బాధ్యతల వలన పనులలో అధిక శ్రమ ఈ రాశి స్త్రీల కి మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణ మిమ్మల్ని ఆనందింప చేస్తుంది.

 

తులారాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఏమాత్రం కష్టం లేకుండా అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవ ప్రార్థనలు వలన మానసిక బలం. ఆఫీసులో పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. అట్టహాసంగా ఏర్పాటు చేసిన పార్టీ వలన అధిక ఖర్చు. దాని వలన మానసిక విచారం. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

 

వృశ్చిక రాశి: ఈరోజు ఉత్సాహకరమైన రోజు. మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించి అనుకున్న కార్యాలను సాధిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఊహించుకుని బాధపడటం మానేయటం వలన మానసికంగా బలవంతులు అవుతారు. ఆఫీసులో పనులను చకచకా పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులపై ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. కావలసిన ధనం చేతికందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు.

 

ధనస్సు రాశి: మీ ఆత్మవిశ్వాసం అంబరాన్ని అంటుతుంది. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. అనుకోని అతిథి రాక వలన మీ సమయం వృధా. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. మీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి మీ సామరస్య ధోరణి వలన ఆఫీసులో ఆహ్లాదకర వాతావరణం. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు నీకు నచ్చిన ప్రదేశానికి విహారయాత్రకు వెళతారు.

 

మకర రాశి: మీరు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. కొన్ని సవాళ్లను ఎదుర్కోవడం కష్టతరమవుతుంది. నిరాశను వదలకపోతే అది మీ మనస్సును శరీరాన్ని తొలిచి వేస్తుంది. సహనంతో వ్యవహరించండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. దైవప్రార్థన వలన మానసిక బలం. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. కుటుంబ సభ్యుల మీద మీ అభిప్రాయాలను బలవంతంగా రుద్దకండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు పాత విషయాలను మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

 

కుంభరాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాటిని రెండు చేతుల అందిపుచ్చుకోండి. మీ శ్రీఘ్ర నిర్ణయం విజయాలను తెస్తుంది ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. మీ తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆఫీసు పనులలో మీ సామర్థ్యంపై అందరి ప్రశంసలు ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ వ్యవహారాల లోనికి మీ బంధువులను రానీయకండి.

 

మీన రాశి: కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. డబ్బు సంపాదనకు అన్ని మార్గాల వైపు చూస్తారు. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో పరుషంగా మాట్లాడకండి. వ్యాపార విస్తరణ కొరకు చేస్తున్న ప్రయాణాలు వలన అలసట తిప్పట. చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు.

ఈరోజు మీ రాశిఫలాలు: మంగళవారం 07 సెప్టెంబర్ 2021 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *