Top Ad unit 728 × 90

రక్షణ రంగ అవసరాలకు అత్యాధునిక డ్రోన్లు…!

రక్షణ రంగ అవసరాలకు అత్యాధునిక డ్రోన్లు…!

 

సాంకేతిక పరిజ్ఞానం సృష్టించిన మరో అద్భుతం రోబోలు, మానవ రహిత విమానాలు (డ్రోన్లు). ఇప్పటికే పలు రంగాల్లో రోబోలు, డ్రోన్లు విశేష సేవలందిస్తున్నాయి. దేశరక్షణలో సైనికులకు బదులుగా కొన్ని పనులను డ్రోన్లతో చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు హైదరాబాద్‌కు చెందిన బిన్‌ఫోర్డ్‌ రోబోటిక్స్‌ సంస్థ కార్యరూపం ఇచ్చింది. ఈ సంస్థ 'గన్‌ మౌంటెడ్‌ డ్రోన్‌ (తుపాకులు అమర్చిన డ్రోన్‌)'ను రూపొందించింది. శత్రుశిబిరంపై విరుచుకుపడనున్న ఈ 'డ్రోన్‌ సైనికులు' మన తెలంగాణలోనే తయారు కానుండటం విశేషం. వీటి తయారీకి భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నది.

 

నాలుగో పారిశ్రామిక విప్లవం: భవిష్యత్తులో డ్రోన్లు, రోబోలు మానవ జీవితంలో భాగమవుతాయని, అన్నిరంగాల్లో ప్రము ఖ పాత్ర పోషిస్తాయని బిన్‌ఫోర్డ్‌ రోబోటిక్స్‌ సంస్థ గట్టిగా నమ్ముతున్నది. ముఖ్యంగా డ్రోన్లు నిఘా, పార్సిల్‌ డెలివరీ వంటి చిన్న పనులనే కాకుండా దేశ రక్షణ వంటి పెద్ద బాధ్యతలు కూడా మోయగలవని భావిస్తున్నది. అందుకే డ్రోన్ల తయారీని నాలుగో పారిశ్రామిక విప్లవంగా అభివర్ణిస్తున్నది. ఈ హైదరాబాదీ సంస్థ వ్యవసాయం, నిర్మాణ రంగం, పారిశుద్ధ్యం, అగ్నిమాపక వ్యవస్థ, రక్షణ రంగాల్లో డ్రోన్ల వినియోగంపై పరిశోధనలు చేస్తున్నది. ఇప్పటికే పలు మోడళ్లలో డ్రోన్లను అభివృద్ధి చేసింది. పురుగుమందులను పిచికారీ చేయగలిగే డ్రోన్లను ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్నది. ఇటీవల కరోనా సమయంలో ఈ డ్రోన్ల సాయంతో పలు ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరేట్‌ వంటి ద్రావణాలను పిచికారీ చేసి కరోనా కట్టడిలో సహాయపడింది.

 

సైనిక అవసరాలకు తగినట్టు: బిన్‌ఫోర్డ్‌ సంస్థ దేశ రక్షణకు ఉపయోగపడే డ్రోన్లను అభివృద్ధి చేసింది. ఇందులో ప్రధానమైనది 'గన్‌ మౌంటెడ్‌ డ్రోన్‌'. దీనికి తుపాకులను అమర్చారు. ఇవి నిఘాతోపాటు శత్రువులను అంతమొందించేందుకు పనిచేస్తాయని సంస్థ చెప్తున్నది. నమూ నా డ్రోన్‌ సిద్ధమైందని, పరీక్షలు పూర్తయ్యాయని సంస్థ వ్యవస్థాపక సీఈవో సిద్ధాంత్‌జైన్‌ పేర్కొన్నారు. వీటి అనుమతి కోసం సైన్యానికి దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. అనుమతులొస్తే వాణిజ్యస్థాయి లో ఉత్పత్తిచేసి ఆర్మీకి అందిస్తామన్నారు. డ్రోన్ల తయారీ కోసం బీడీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. దీని పరిధి 30 కిలోమీటర్లు. శత్రువులపై నిఘా పెట్టడం,ఎవరైనా హద్దు దాటితే నియంత్రించవచ్చని వివరించారు.

రోటర్‌క్రాఫ్ట్‌: దేశంలోనే అతిపెద్దదైన రోటర్‌క్రాఫ్ట్‌ డ్రోన్‌ను సంస్థ అభివృద్ధి చేసింది. ఇది దారి తప్పిన డ్రోన్లను నిలువరిస్తుందని, సరిహద్దుల్లో నిఘా కేం ద్రంగా పనిచేస్తుందని సంస్థ చెప్తున్నది.

 

యాంటీ మైన్‌ డ్రోన్‌: సరిహద్దు రక్షణలో, మావోయిస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో సైనికులకు ఉపయోగపడేలా మందుపాతరలను గుర్తిం చే డ్రోన్లు ఇవి. మెటల్‌ డిటెక్టర్‌ సాయం తో మందుపాతరలను గుర్తించి, అవి ఎక్కడ ఉన్నాయో జియో మ్యాపింగ్‌ చేస్తాయి. వాటిని నిర్వీర్యం చేసేందుకు టెన్నిస్‌ బాల్‌ సైజులో ఉన్న చిన్న డిటోనేటర్లను జారవిడుస్తాయి.

 

ప్రాణాలు కాపాడటమే మా లక్ష్యం: సైనికులుశత్రువుల చేతిలో తమ విలువైన ప్రాణాలు కోల్పోతుండటం బాధగా అనిపించింది. వారి ప్రాణాలు కాపాడటంతోపాటు దేశ రక్షణలో ఉపయోగపడే డ్రోన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం. రక్షణ రంగ అవసరాలు తీర్చే డ్రోన్లను తయారు చేశాం. ఇది మా బృందం సమిష్టి విజయం.

 

రక్షణ రంగ అవసరాలకు అత్యాధునిక డ్రోన్లు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *