ఏలియన్స్ తో అమెరికా ఒప్పందం...!
ఈ విశాలమైన విశ్వంలో మనిషి కాకుండా ఇతర గ్రహాలపై జీవులు ఉన్నాయా అనే విషయంపై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. వేరే గ్రహాలపై జీవరాసులు ఉన్నాయని, పరిశోధనలు చేస్తున్నారు. అయితే, నాసా వీటిని కొట్టిపారేసింది. విశ్వంలో మరొక జీవి లేదని చెప్తూనే ఏరియా 51 లో రహస్యంగా పరిశోధనలు చేస్తున్నారు. ఏలియన్స్ గురించి ఇజ్రాయిల్ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ తో అమెరికా రహస్యంగా గాలాక్టిక్ ఫెడరేషన్ ఒప్పందం చేసుకున్నారని, అమెరికాలో మనుషుల మధ్య ఏలియన్స్ కూడా రహస్యంగా తిరుగుతున్నాయని అన్నారు. అంగారక గ్రహంలో అండర్ గ్రౌండ్ లో ఏలియన్స్ ఉన్నాయని అన్నారు. ఏలియన్స్ గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తెలుసు అని, అయన ఈ విషయాన్ని బహిర్గతం చేయాలని అనుకున్నా, గాలాక్టిక్ ఫెడరేషన్ ఒప్పుకోలేదని అన్నారు. ఎషెడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలంగా మారాయి.
