Top Ad unit 728 × 90

వాటి వల్లనే ఏలూరులో ఈ వింత రోగం...!

లెడ్, నికెల్ వంటి భారలోహాల వల్లే ఏలూరులో ప్రజలు మూర్ఛ ఇతరత్రా లక్షణాలతో పడిపోతున్నారని తేల్చారు నిపుణులు. ప్రధానంగా లెడ్ అనే భార లోహమే కీలక కారణమని తేలింది. అనారోగ్యం బారిన పడిన వారి బ్లడ్ శాంపిల్స్‌లో లెడ్, నికెల్ ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు జరిపిన పరీక్షల్లో తేలింది. లెడ్ బ్యాటరీస్‌లో ఉండే పదార్ధం. ఈ భార లోహం ప్రమాదకరమైనది. ఇది మనుషుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. మన శరీరంలోకి లెడ్ వెళ్తే మెదడు సరిగా పనిచెయ్యదు. దాంతో ఫిట్స్ వచ్చేస్తుంది. అంతేకాదు తలనొప్పి, మతిమరపు లక్షణాలు కూడా వస్తాయి. నీరసం కూడా వస్తుంది. ఏలూరులో బాధితులకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అందువల్ల ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు చెబుతున్నది నిజం అని నమ్మొచ్చు. ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఇదే ఇప్పుడు తేలాల్సిన విషయం. తాజా అంచనాలు, అనుమానాల ప్రకారం, నీరు లేదా పాలలో ఈ భార లోహాలు కలిసి ఉంటాయనీ వాటిని తాగిన వారికి అవి శరీరంలో చేరి ఉంటాయనే అనుమానాలు ఉన్నాయి. తమ సాంపిల్స్ టెస్ట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ వర్గాలు మంగళగిరి డాక్టర్ల ద్వారా అందించాయి. ఐతే నీటిలో ఏ సమస్యా లేదని ఆల్రెడీ ఏలూరు డాక్టర్లు తేల్చారు. పాలలోనూ సమస్య లేదంటున్నారు. మరి ఎందులోనూ సమస్య లేకపోతే అవి రక్తంలోకి ఎలా వచ్చాయో తేలాలి. తాజాగా కూరగాయలను కూడా టెస్ట్ చేస్తున్నారు. వాటిలో ఏమైనా చేరాయేమో అనే అనుమానం కలుగుతోంది.

ఇప్పటివరకు ఈ వింత వ్యాధి బాధితుల సంఖ్య 450కి పెరిగింది. గంటగంటకూ కేసుల సంఖ్య పెరగుతుంటే ఏలూరు ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా బాధితులకు 3 నుంచి 5 నిమిషాలపాటు మూర్ఛ వస్తుంది. ఒక్కసారి మాత్రమే, రిపీట్‌ కాలేదని డాక్టర్లు చెప్పినప్పటికీ, వరుసగా వస్తూనే ఉందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఇతర లక్షణాలు మతిమరుపు, ఆందోళన, వాంతులు, తలనొప్పి, వెన్నునొప్పి, నీరసం కూడా ఉన్నాయి. ఇప్పటివరకూ ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదు. తీవ్రత తక్కువగా ఉంది. మూర్ఛఅనేది ఒకేసారి వస్తుంది. మళ్లీ రిపీట్‌ కాలేదు. ఏలూరు మున్సిపల్‌ వాటర్‌ పంపిణీ లేని ప్రాంతాల్లోకూడా అస్వస్థతకు గురయ్యారు. ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకించి పలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదు. రోజూ మినరల్‌వాటర్‌ తాగే వాళ్లుకూడా అస్వస్థతకు గురయ్యారు అని వైద్యాధికారులు తెలిపారు.

నేడు ఏలూరుకు కేంద్రం వైద్య బృందాన్ని అత్యవసరంగా పంపుతోంది. ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఉత్తర్వుల మేరకు నేడు ప్రత్యేక బృందం విచారణ జరపనుంది. ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ అవినాష్ డియోష్టవర్, వైరాలజిస్ట్, డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉన్నారు. నేటి సాయంత్రం నాటికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

వాటి వల్లనే ఏలూరులో ఈ వింత రోగం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *