Top Ad unit 728 × 90

దీపికా పదుకొణే కొత్త సినిమా ఏంటంటే…!

దీపికా పదుకొణే ఈ పేరుకు పరిచయం అంతగా అవసరం లేదు. కుర్రకారుని ఎంతగానో ఉవిల్లూరించిన సుందరి దీపికా. ఇటీవల దీపికా, రన్‌వీర్ సింగ్‌లు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీపిక ప్రస్తుతం శకున్ బాత్రాతో కలిసి తన తరువాతి సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం వారు గోవా కూడా వెళ్లారు. ఈ సినిమాలో సిద్దాంత్ చతుర్వేది, అనన్య పాండేలు కూడా చేస్తున్నారు. ఈ సినిమా పేరుకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం ఇంకా లేదు. ఈ సినిమాకు సంభందించి ప్రస్తతుం ఎటువంటి సమాచారం బయటకు రాకుండా చూస్తున్నారు. అయితే ఇటీవల దీపికా ఒక స్టోరీను షేర్ చేసింది. అది ఈ సినిమాలో దీపికాకు స్టైలిష్‌గా చేస్తున్న అనైత ష్రాఫ్ అడజానియా షేర్ చేశారు. ఈ పోస్ట్ సినిమా పేరుకు హింట్ మాదిరిగా ఉంది. ఈ ఫొటోలో ఒకవైపు దీపికా ఉంటే మరో వైపరు ఓన్లీ లవ్ ప్రాజెక్ట్ 70 అని అందమైన సముద్రం ఉంది. అంతేకాకుండా ఓన్లీ లవ్ ప్రాజెక్ట్ 70 అనేది పెద్ద లవ్ గుర్తులో ఉంది. దాంతో ఈ పోస్ట్ సినిమా పేరుకు హింట్‌గా అందరూ భావిస్తున్నారు. ఈ పోస్ట్ చూసిన దీపికా ఫోలోవర్స్ వెంటనే ఈ సినిమా పేరు ఓన్లీ లవ్ అని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా మోడర్న్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోందని ఈ పోస్ట్ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంతవరకు వేచి చూడాల్సిందే.

దీపికా పదుకొణే కొత్త సినిమా ఏంటంటే…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *