ప్రభుత్వ ఉద్యోగిగా చిరు, నక్సలైట్‌గా రాంచరణ్...!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది. అయితే, చెర్రీ సరసన నటించే హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. మొదట బాలీవుడ్ నటి కియారా అడ్వానీని అనుకున్నారు. కానీ కియారా బిజీగా ఉండటంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. అయితే, ఈ పాత్ర కోసం రష్మికను సంప్రదించగా దానికి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. జనవరి మూడో వారంలో చెర్రీ, రష్మిక షూటింగ్లో కూడా పాల్గొననున్నారని టాక్. కాగా, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఇక్కడే షూట్ చేయనున్నారట. ఆచార్యలో దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకలపై పోరాటం చేసే ఎండోమెంట్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా చిరు కనిప్తాడని తెలుస్తోంది. ఇక రాంచరణ్ నక్సలైట్‌గా కనిపించనున్నాడు.
