Top Ad unit 728 × 90

దారుణమైన పరిస్తితిలో అత్యంత సంపన్న దేశం

దారుణమైన పరిస్తితిలో అత్యంత సంపన్న దేశం

 

మనకు ఒక సామెత ఉన్నది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఈరోజు రోడ్డుపై ఉన్న వ్యక్తి రేపటికి కోట్లు సంపాదించి మేడలు కట్టొచ్చు. మేడల్లో ఉండే వ్యక్తి రోడ్డుపైకి రావొచ్చు. ఏది శాశ్వతం కాదు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కరోనా వచ్చి ప్రపంచాన్ని ఎలా దెబ్బకొట్టిందో చెప్పక్కర్లేదు. కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్నదేశంగా పేరు తెచ్చుకున్న కువైట్ ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 

ముడి చమురును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో కువైట్ కూడా ఒకటి. కువైట్ కు 89శాతం ఆదాయం ముడి చమురు నుంచే వస్తుంది. అయితే, కరోనా కారణంగా ముడి చమురు నుంచి వచ్చే ఆదాయం పడిపోయింది. ఆదాయ మార్గాల సమీకరణ కోసం కువైట్ ప్రభుత్వం కొత్త రుణ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ రుణ చట్టంపై పార్లమెంట్, ప్రభుత్వం మధ్య రగడ జరిగింది. ఈ చట్టం అమలులోకి వస్తే కువైట్ తిరిగి ఆర్ధికంగా నిలబడే అవకాశం ఉన్నది. 2017 లో కువైట్ ఇంటర్నేషనల్ మార్కెట్ బ్రాండ్లను రిలీజ్ చేసి రుణాలను సమీకరించింది.

అప్పట్లో ముడి చమురును భారీ డిమాండ్ ఉండటంతో ఈ బాండ్లను కొనుగోలు చేశారు. కానీ, ఇప్పుడు ముడి చమురుకు డిమాండ్ తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా కువైట్ దాదాపుగా 46 బిలియన్ డాలర్లను కోల్పోయింది.

దారుణమైన పరిస్తితిలో అత్యంత సంపన్న దేశం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *