Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

ఏలూరు ఆశ్రం కోవిడ్ ఆస్పత్రిలో దారుణం...!

ఏలూరు ఆశ్రం కోవిడ్ ఆస్పత్రిలో దారుణం...!

 

 

కరోనా బాధితుల పట్ల అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. దీంతో అమానుష ఘటనలు వెలుగుచూస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కోవిడ్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. కరోనా బాధితురాలిని డిశ్చార్జ్ చేస్తామని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చిన అధికారులు తర్వాత ఆమె కనిపించడంలేదని చెప్పారు. తీరా రికార్డులు చూస్తే బాధితురాలు మృతి చెందినట్లుగా ఉంది. దీంతో మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

 

పెదవేగి మండలం, కూచుంపూడి గ్రామానికి చెందిన కళాతోటి అన్నపూర్ణకు కరోనా సోకడంతో ఈ నెల 13న ఏలూరు ఆశ్రం కోవిడ్ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆమెను డిశ్చార్జ్ చేస్తున్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. దాంతో బంధువులు ఆస్పత్రికి రాగా ఆ రోజు డిశ్చార్జ్ చేయలేదు. మళ్లి శనివారం రోజు ఆమె కుమారుడు ఆస్పత్రికి ఫోన్ చేయగా డిశ్చార్జ్ చేస్తామన్నారు. దీంతో వారు ఆస్పత్రికి రాగా సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పారు. చివరికి ఆమె కనిపించడంలేదన్నారు.అన్నపూర్ణ చనిపోయిందని చెప్పారు. కనీసం ఆమె మృతదేహం చూపించాలని వేడుకున్నారు. అది కూడా సాధ్యం కాదనే సమాధానం వచ్చంది. దీంతో మృతిరాలి బంధువులు అధికారులపై మండిపడ్డారు. ఈ ఘటన ఏలూరులో దుమారం రేపింది.

ఏలూరు ఆశ్రం కోవిడ్ ఆస్పత్రిలో దారుణం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *