Top Ad unit 728 × 90

సినిమా థియేటర్లో క్షుద్ర పూజలు, దేనికోసమంటే…!

సినిమా థియేటర్లో క్షుద్ర పూజలు, దేనికోసమంటే…!

 

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని వైఎస్సార్ కూడలిలో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని కొంద‌రు ఆక్ర‌మించుకున్నారు. గ‌త 50 ఏళ్లుగా ఆ భూమి ఆక్ర‌మ‌ణ‌దారుల చేతుల్లోనే ఉంది. ఇటీవ‌ల దాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవాల‌ని భావించారు. ఆ స్థ‌లంలోనే ఉన్న పాడుబ‌డ్డ లక్ష్మీ థియేటర్​ను శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూల్చ‌డానికి య‌త్నించారు. ఆక్రమణదారుల్లో ఒకరైన నున్న చంద్రావతి అనే మహిళ, థియేటర్​ను కూలగొడితే ఒంటిపై కిరోసిన్ పోసుకుని బ‌ల‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌తాన‌ని బెదిరించింది. అక్కడే ఉన్న రాజానగరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

అనంత‌రం థియేటర్​ బ‌ద్ద‌లుకొట్టి లోప‌లికి ప్ర‌వేశించిన‌ దేవాదాయ శాఖ అధికారులు, లోపల కనిపించిన దృశ్యం చూసి కంగుతిన్నారు. మూడు లోతైన గోతులు, వాటి చుట్టూ పువ్వులు, నిమ్మకాయలు, కత్తి, రక్తపు చారలు, పెద్ద ఎత్తున క్షుద్ర పూజలు సెట్టింగే ఉంది. గుప్త‌నిధులు ఉంటాయనే ఆశతో ఈ ప‌నులు చేసి ఉంటారని దేవాదాయ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం జేసీబీ సాయంతో థియేటర్​ను కూల్చివేశారు.

సినిమా థియేటర్లో క్షుద్ర పూజలు, దేనికోసమంటే…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *