Top Ad unit 728 × 90

క్రికెట్‌కు ఏబీ డివిలియర్స్ గుడ్‌బై....

క్రికెట్‌కు ఏబీ డివిలియర్స్ గుడ్‌బై....

 

 

దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వీడియో సందేశం ద్వారా పేర్కొన్నాడు.

 

 

ఆ రకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో మే19న ఆడిన ఐపీఎల్ మ్యాచే అతడికి చివరిది. డివిలియర్స్ తన చివరి టెస్ట్ ఆస్ట్రేలియాతో (మార్చి 2018లో), చివరి వన్డే భారత్‌తో (ఫిబ్రవరి 2018లో) ఆడాడు.

 

 

'నిజం చెప్పాలంటే నేను చాలా అలసిపోయాను. భారత్, ఆస్ట్రేలియాలపై అద్భుతమైన సిరీస్ విజయాలను సాధించాక, రిటైరవ్వడానికి ఇదే సరైన సమయం' అని తన సందేశంలో ఏబీ చెప్పాడు. దీంతో పద్నాలుగేళ్ల క్రికెట్ కెరీర్‌కు ఏబీ స్వస్తి పలికాడు.

 

 

'114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. ఇప్పటిదాకా నా వంతు బాధ్యత నేను నిర్వర్తించాను. ఇప్పుడు నా స్థానంలో వేరేవాళ్లు రావల్సిన అవసరం ఉంది' అని డివిలియర్స్ అన్నాడు.

 

 

మండు వేసవిలో ఈ ఐపీఎల్‌లో డివిల్లీర్స్‌ విధ్వంసక బ్యాటింగ్‌, అచ్చెరువొందించే ఫీల్డింగ్‌ విన్యాసాలను ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆస్వాదించారు. వచ్చే ఏడాదీ అతడి మెరుపులను వీక్షిస్తామని భావించారు. ఐపీఎల్‌లో అతడి అమోఘ ఇన్నింగ్స్‌ ముగిసి కొన్ని రోజులు కూడా కాలేదు..

 

 

ఏబీనుంచి షాకింగ్‌లా రిటైర్మెంట్‌ నిర్ణయం వెలువడింది. టెస్ట్‌లు, వన్డేలు, టీ20లనుంచి తక్షణమే తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. తద్వారా 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు 34 ఏళ్ల ఈ సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ స్వస్తిపలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండే ఒత్తిడిని తన శరీరం ఏమాత్రం తట్టుకోలేక పోతోందని చెప్పాడు. టెస్ట్‌లు, వన్డేలు, టీ20ల్లో కలిపి అతడు మొత్తం 20,014 పరుగులు సాధించాడు. 'క్రికెట్‌లో అన్ని విభాగాలనుంచి తక్షణమే వైదొలగాలని నిర్ణయించుకున్నా. 114 టెస్ట్‌లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడిన నేను ఇక ఇతరులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. నిజం చెప్పాలంటే నేను అలసిపోయా' అని డివిల్లీర్స్‌ వివరించాడు.

 

 

విదేశాల్లోనూ ఆడను..: 

ఇకపై విదేశాల్లో ఆడే ఉద్దేశం తనకు లేదని ఏబీ స్పష్టంచేశాడు. అంటే వచ్చే సీజన్‌లో అతడు ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లేనట్టే. 'విదేశాల్లో ఆడాలని భావించడంలేదు. అయితే దేశవాళీలో టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా. డుప్లెసిస్‌, దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది' అని డివిల్లీర్స్‌ తెలిపాడు.

 

 

వన్డేల్లో మూడు రికార్డులూ అతడివే..: ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు వన్డే వరల్డ్‌ రికార్డులు సొంతం చేసుకున్న ఘనత ఏబీది. వేగవంతమైన అర్ధ సెంచరీ (16 బంతులు), సెంచరీ (31 బంతులు), 150 (64 బంతులు) డివిల్లీర్స్‌ పేరిట ఉన్నాయి. మూడుసార్లు (2010, 2014, 2015) అతడు ఐసీసీ 'వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు అందుకున్నాడు.

 

 


2011 ప్రపంచకప్‌ తర్వాత గ్రేమ్‌ స్మిత్‌నుంచి డివిల్లీర్స్‌ సౌతాఫ్రికా వన్డే  జట్టు పగ్గాలు చేపట్టాడు. ఆపై హషీమ్‌ ఆమ్లా నుంచి టెస్ట్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. కానీ ముంజేతి గాయం కారణంగా 2016లో టెస్ట్‌ జట్టు నాయకత్వ బాధ్యతలనుంచి తప్పుకొన్నాడు.

 


వినూత్న బ్యాట్స్‌మన్‌ : సీఎస్‌ఏ..

 

డివిల్లీర్స్‌ వినూత్న బ్యాట్స్‌మన్‌ అని క్రికెట్‌ సౌతాఫ్రికా అధ్యక్షుడు క్రిస్‌ నెన్జానీ కొనియాడారు. 'క్రికెట్‌ అన్ని కాలాల గొప్ప ఆటగాళ్లలో ఏబీ ఒకడు. తన అమోఘ ఆటతీరుతో అతడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాడు. తనదైన బ్యాటింగ్‌తో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లను..ముఖ్యంగా టెస్ట్‌లను కొత్త పుంతలు తొక్కించాడు. యువ క్రికెటర్లకు అతడు మార్గదర్శకుడు. క్రికెట్‌ ప్రపంచం ఓ గొప్ప ఆటగాడిని కోల్పోతోంది' అని క్రిస్‌ అన్నారు.


 

క్రికెట్‌కు ఏబీ డివిలియర్స్ గుడ్‌బై.... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *