Top Ad unit 728 × 90

పేటీఎం నుంచి క్రెడిట్ కార్డులు, దిమ్మతిరిగే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

పేటీఎం నుంచి క్రెడిట్ కార్డులు, దిమ్మతిరిగే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

మీరు పేటీఎం వాడుతున్నారా అందులో లావాదేవీలు నడుపుతున్నారా అయితే మీకోసం కంపెనీ ఓ శుభవార్తను అందించింది. దేశీయ ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం తన కస్టమర్ల కోసం పేటీఎం ఫస్ట్ కార్డ్ పేరిట ఓ నూతన క్రెడిట్ కార్డును భారత్‌లో లాంచ్ చేసింది. సిటీ బ్యాంక్‌తో భాగస్వామ్యం అయిన పేటీఎం ఈ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా కస్టమర్లకు 1 పర్సంట్ యూనివర్సల్ అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

దేశంలోనే ఈ తరహా క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్న మొదటి కార్డు ఇదే కావడం విశేషం. కాగా ఈ కార్డును పొందేందుకు ఎలాంటి చార్జిలు లేవు. అలాగే ఇంటర్నేషనల్‌గా కూడా ఈ కార్డును వాడుకోవచ్చు.

రూ.50వేలకు పైగా వాడుకుంటే

ఈ కార్డును ఉపయోగించి ఏడాదికి రూ.50వేలకు పైగా వాడుకుంటే వార్షిక ఫీజు రూ.500 లను రద్దు చేస్తారు. ఈ కార్డుతో కస్టమర్లు పలు వస్తువులను ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఈ కార్డు కావాలంటే పేటీఎం కస్టమర్లు పేటీఎం యాప్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

దేశంలో, విదేశాల్లోనూ...

పేటీఎం క్రెడిట్ కార్డుతో ప్రతి లావాదేవీపై ఒక శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు విధించలేదు. ప్రతి నెల ఈ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డు అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డును వినియోగదారులు దేశంలోనూ, విదేశాల్లోనూ ఉపయోగించుకోవచ్చు

వార్షిక ఫీజు రూ. 500

క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజు రూ. 500 వసూలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ కార్డు ద్వారా సంవత్సరానికి రూ. 50,000 పైగా వాడుకున్న కస్టమర్లకు వార్షిక ఫీజు మినహాయించింది. పేటీఎం యాప్ ద్వారా వినియోగదారులు పేటీఎం ఫస్ట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డు యూజర్లు డైనింగ్, షాపింగ్, ట్రావెల్ వంటి వాటికి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు కూడా పొందొచ్చు.

పేటీఎం ప్రోమో కోడ్స్‌

క్రెడిట్ కార్డు యూజర్లు తొలి నాలుగు నెలల కాలంలో కార్డు ద్వారా కనీసం రూ.10,000 ఖర్చు చేస్తే రూ.10,000 విలువైన పేటీఎం ప్రోమో కోడ్స్‌ను పొందొచ్చు. పేటీఎం ఫస్ట్ కార్డులో లావాదేవీల వివరాలు మాత్రమే కాకుండా పేటీఎం, సిటీ బ్యాంక్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు కూడా చూడొచ్చు.

రూ. 10 కోట్లు ఫ్రాడ్

ఇదిలా ఉంటే ఉద్యోగులు, వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేసిన క్యాష్‌బ్యాక్‌ మోసం పరిమాణం దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని తమ అంతర్గత విచారణలో తేలినట్లు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు.

వందల కొద్దీ విక్రేతలను

ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. 'దీపావళి తర్వాత కొంత మంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్‌ లభిస్తుండటాన్ని మా టీమ్‌ గుర్తించింది. దీన్ని మరింత లోతుగా పరిశీలించాలని మా ఆడిటర్లను కోరాం' అని విజయ్‌ శేఖర్‌ శర్మ చెప్పారు.

మరికాస్త సమయం

లభాల గురించి మాట్లాడుతూ మరింత మంది యూజర్లు, వ్యాపారులకు చేరువయ్యేందుకు భారీగా వ్యయాలు చేస్తున్నందున లాభాల్లోకి మళ్లేందుకు మరికాస్త సమయం పట్టవచ్చన్నారు. యూజర్ల సంఖ్య 30 నుంచి 50 కోట్ల దాకా, వ్యాపార సంస్థల సంఖ్య ప్రస్తుతమున్న 1.2 కోట్ల నుంచి 4 కోట్లకు పెరిగేదాకా లాభాలు నమోదు కాకపోవచ్చని విజయ్‌ శేఖర్‌ శర్మ పేర్కొన్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

పేటీఎం నుంచి క్రెడిట్ కార్డులు, దిమ్మతిరిగే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *