Top Ad unit 728 × 90

యాపిల్ ఐఫోన్11 సిరీస్ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా

యాపిల్ ఐఫోన్11 సిరీస్ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఐ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం ఆవిష్కృతమైంది. గతేడాది ఐఫోన్ టెన్ శ్రేణి ఫోన్లతో ఆకర్షించిన యాపిల్ సంస్థ, సెప్టెంబర్ 10,2019, మంగళవారం నాడు క్యుపర్టినోలోని తమ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో ఆహ్లాదకరంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ లను విడుదల చేసింది. అత్యంత శక్తిమంతమైన ఏ13 బయోనిక్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఫోన్ల ప్రత్యేకతగా సంస్థ పేర్కోంది.

ఐఫోన్‌ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. కొత్తగా గ్రీన్, పర్పుల్‌ రెడ్, యెల్లో రంగుల్లో లభించనున్నది. స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్‌ అల్ట్ర్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 6.1 లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్‌ సెల్ఫీలు, ఏ13 బయోనిక్‌ చిప్‌ వంటి ప్రత్యేకతలున్నాయి.

ఐఫోన్‌ 11 -- 64 జీబీ --ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది. కాగా డాలర్ విలువ రూ.71గా అనుకుంటే, మన రూపాయల్లో 49,629 అవుతుంది. దేశీయంగా సుంకాలకు తోడు, ఎంత ధర నిర్ణయిస్తారో సంస్థ ఇంకా వెల్లడించలేదు. తక్కువ, మధ్యస్థాయి వెలుగులోనూ అత్యంత స్పష్టంగా చిత్రాలు తీయగలిగే మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను ఐఫోన్ 11 ప్రో, 11 ప్రోమ్యాక్స్ లలో అమర్చినట్లు సంస్థ తెలిపింది. ఇక ఐఫోన్ 11 ప్రో-- 128 జీబీ-- ధర 999 డాలర్ల నుంచి ,ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ 128 జీబీ -- ధర-- 1099 డాలర్ల నుంచి మొదలవుతుంది. వీటికి 2019 సెప్టెంబరు 13 నుంచి ముందస్తుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. మూడు ఐఫోన్ 11 మోడల్స్ సెప్టెంబర్ 20 నుంచి పేటీఎం మాల్లో లభ్యం కానున్నాయి. పేటీఎం మాల్ 2019 ఐఫోన్ మూడు మోడల్స్ పై రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది.

వీటి ప్రత్యేకతలు
ఐఫోన్ 11: 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా తెర కలిగి బ్లాక్ గ్రీన్, ఎల్లో, పర్పుల్ వైట్ రెడ్ రంగుల్లో లభ్యం అవుతుంది. వెనుకవైపు 2 కెమేరాలు (12 ఎంపీ వైడ్ అల్ట్రా వైడ్ 4కే స్పష్టత, సినిమాటిక్ వీడియో, ఇప్పటివరకు ఐఫోన్లో లేని అత్యధిక స్పష్టమైన వీడియోలు తీయొచ్చు, నైట్ మోడ్) డాల్బీ అట్మోస్ శబ్దం, స్లో మోషన్ సెల్ఫీస్ (స్లోఫీస్), మరే ఇతర స్మార్ట్ ఫోన్లో లేని, అత్యధిక వేగంతో పనిచేసే ఏ 13 బయోనిక్ సీపీయూ, అత్యంత వేగంతో పనిచేసే జీపీయూ, ఐఫోన్ టెన్ ఆర్ కంటే మరో గంట అదనంగా పనిచేసే బ్యాటరీ, శరవేగంతో ముఖాన్ని గుర్తించే కెమేరా కలిగి ఉంది.

ఐఫోన్ 11 ప్రో 5.8 అంగుళాల సూపర్ రెటీనా అత్యంత దృఢమైన తెర కలిగి, మిడ్ నైట్ గ్రీన్ స్పేస్ గ్రే, సిల్వర్ వైట్ గోల్డ్ రంగుల్లో లభ్యం అవుతోంది. వెనుకవైపు సింగిల్ పీస్ గ్లాస్, స్టెయిన్ లెస్ స్టీల్, వెనుకవైపు 3 కెమేరాలు అమర్చారు. డాల్బీ అట్మోస్ శబ్దం, సెకనుకు లక్ష కోట్ల ఆపరేషన్లు జరిపే సీపీయూ, 40 శాతం తక్కువ విద్యుత్తు వినియోగం, ఐఫోన్ టెన్ ఎస్ కంటే 4 గంటల అదనంగా పనిచేసే బ్యాటరీ దీని ప్రత్యేకతలు.

ఇక ఐఫోన్ 11ప్రో మ్యాక్స్ విషయానికొస్తే 6.5 అంగుళాల తెర కలిగి, ఐఫోన్ టెన్ ఎస్ మ్యాక్స్ కంటే 5 గంటలు అదనంగా వచ్చే బ్యాటరీ కలిగి ఉంది. వెనుక వైపు 3 కెమేరాలతో (12 వైడ్ అల్ట్రావైడ్ టెలిఫోటో) ఒకే సమయంలో 3 భిన్న రకాలుగా ఒకే ఫొటో తీయొచ్చు. కను రెప్పల మధ్య చోటును కూడా స్పష్టంగా చూపే సామర్థ్యం దీని సొంతం గా సంస్ధ పేర్కోంది.

ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు 3 వేరియంట్స్ తో పాటు సీరీస్ 5 ఆపిల్ వాచ్ ను, 7వ తరం ఐప్యాడ్ ను కూడా యాపిల్ సంస్ధ నిన్న విడుదల చేసింది. మామూలు వాచ్‌లాగానే ఎప్పుడు డిస్‌ప్లే కంటికి కనిపించేలా ఐ వాచ్‌ సిరీస్‌ 5ను ఆవిష్కరించింది. ఈ వాచ్‌ల్లో కంపాస్‌ను కూడా అమర్చింది. ధర 399 నుంచి 499 డాలర్లు. కాగా ఏడో జనరేషన్‌ ఐప్యాడ్‌ ధరలు 329 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. వీటి అమ్మకాలు 2019 సెప్టెంబరు 30 నుంచి మొదలవుతాయి. కొత్తగా వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌-యాపిల్‌ టీవీ, వీడియో గేమింగ్‌ సర్వీస్‌-ఆర్కేడ్‌లను అందుబాటులోకి తెచ్చింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

యాపిల్ ఐఫోన్11 సిరీస్ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *