Top Ad unit 728 × 90

రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 స్పెషల్ డిస్కౌంట్తో...!

రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 స్పెషల్ డిస్కౌంట్తో...!

 

దసరా స్పెషల్స్ సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లో 'రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360' మీద ప్రత్యేకమైన డిస్కౌంట్ ను ఇచ్చారు. స్మార్ట్ క్యామ్ ను 2999 రూపాయలకు లాంఛ్ చేయగా పండుగ ఆఫర్ లో భాగంగా 400 రూపాయలు డిస్కౌంట్ లో లభించనుంది. ఇంతకు ముందు అందుబాటులో ఉన్న ధరతో పోలిస్తే ఇది కాస్త తక్కువగానే ఉంది. అక్టోబర్ 28 ఆఫర్ ముగియనుంది. రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 ఫుల్ హెచ్ డీ వీడియో రికార్డింగ్ చేయగలదు. రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 ప్రస్తుతం భారత్ లో 2599 రూపాయలకే లభించనుంది. నెల ఆరంభంలో భారత్ లో కెమెరాను లాంఛ్ చేశారు. అక్టోబర్ 16 నుండి అమ్మకానికి ఉంచారు. డిస్కౌంట్ ప్రైస్ అక్టోబర్ 28 వరకూ ఉండనుంది.

 

రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 ను భారత్ లో రియల్ మీ ఎన్1 సోనిక్ ఎలెక్ట్రిక్ టూత్ బ్రష్, రియల్ మీ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2 తో పాటూ లాంఛ్ చేశారు. రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 ఫుల్ హెచ్ డీ(1080పి) రెజెల్యూషన్ తో వీడియోను రికార్డు చేయగలదు. రియల్ టైమ్ అలర్ట్స్ కోసం ఏఐ మోషన్ డిటెక్షన్ ను సపోర్టు చేయనుంది. కష్టమర్లు కావాలనుకుంటే టూ-వే వాయిస్ టాక్ రిమోట్ కాల్స్ ను ఉపయోగించుకోవచ్చు. మంచి ఇమేజ్ క్వాలిటీ కావాలని అనుకునే వారు 3డీ నాయిస్ క్యాన్సెలేషన్ ను వినియోగించవచ్చు. కెమెరాకు మెకానికల్ గింబెల్ కూడా ఉంది 360 డిగ్రీల పనోరమిక్ ఫుటేజ్ సాయంతో బ్లైండ్ స్పాట్ అంటూ లేని వీడియోలు రికార్డు అవుతాయి. రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 ఆటోమేటిక్ గా నైట్ విజన్ మోడ్ లోకి వెళ్ళిపోతుందని రియల్ మీ సంస్థ చెబుతోంది.

 

రియల్ మీ స్మార్ట్ క్యామ్ 360 స్పెషల్ డిస్కౌంట్తో...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *