బాధ్యత ఉండక్కర్లేదా జగన్!
బాధ్యత ఉండక్కర్లేదా జగన్!
-సెక్యూరిటీ విషయంలో జగన్ బెట్టు చేస్తున్నారు.
సీఎం స్థాయి భద్రత కావాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఎందుకు అంత సెక్యూరిటీ కోరుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
జగన్ కేవలం ఓ సాధారణ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయినా జగన్ సంతృప్తి చెందటంలేదు.
జగన్ కోరుకుంటున్నట్లుగా 900మందితో సెక్యూరిటీ కల్పిస్తే నెలకు 7.50కోట్ల చొప్పున ఖర్చు అవుతాయి. అంటే సంవత్సరానికి 90కోట్ల పైనే ఖర్చు అవుతుంది. అసలే గత ప్రభుత్వ విధానాల వలన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సంక్షోభ సమయంలో భాద్యతయుతమైన ఏ నేత ఇలాంటి అదనపు ఖర్చుతో కూడుకున్న భద్రతను కోరుకోరు కానీ, జగన్ మాత్రం రాష్ట్రం ఏమైపోతే నాకేం అన్నట్లుగా తనకు అదనపు సెక్యూరిటీ ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.
జగన్ ప్రాణాలకు ప్రజల నుంచి ఎలాంటి ముప్పు లేదు. ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లుగా 900మందితో సెక్యూరిటీని నియమిస్తే జగన్ ప్రజల్లోకి వెళ్ళడం కష్టమే. ప్రతి చోట ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. అయినప్పటికీ ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గడం లేదు. తనకు 900 మందితో ఖచ్చితంగా భద్రత కావాల్సిందేనని కోరుతున్నారు.
ఇదే జగన్ ను వేలెత్తి చూపేలా చేస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా గట్టేక్కేందుకు బాధ్యతయుతమైన నేతగా ప్రభుత్వానికి సహకరించాల్సిన నేతే... భద్రత పేరిట వృధా ఖర్చులతో హంగు ఆర్భాటాలు కోరుకుంటుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.