Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన 'దోస్త్‌' గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఇప్పటికే పూర్తయింది. దీనిని ఈనెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.  పంచాంగం: అక్టోబర్ 27, 2020  మంగళవారం | తిధి: ఏకాదశి ఉ 11:31 తదుపరి ద్వాదశి | నక్షత్రం: శతభిషం ఉ 8:27 తదుపరి | పూర్వాభాద్ర | యోగం: ధృవ రా 3:13 | కరణం: భద్ర ఉ :11:33 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6:10 | సూర్యాస్తమయం: 5:48 | రాహుకాలం: మ 3:00 - 4:40 | యమగండం: ఉ 9:00  - 10:30 | వర్జ్యం: మ 3:19- 5:03 | దుర్ముహూర్తం: ఉ 8:21 - 9:13 & రా 11:09 - 11:53 | అమృతకాలం: రా 12:19 - 2:06 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

కొత్త చట్టాలతో నిరుపేదలకు బాధ కలగొద్దు కేసీఆర్...!

కొత్త చట్టాలతో నిరుపేదలకు బాధ కలగొద్దు కేసీఆర్...!

 

కొత్త చట్టాల అమల్లో నిరుపేదలకు బాధ కలగకుండా చూడాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో కేసీఆర్ సమావేశం అయ్యారు. సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చట్టాల ఫలితాలు చివరి గుడిసె వరకు అందేలా చూడటమే లక్ష్యమని చెప్పారు. నూతన చట్టాల అమలు కోసం ప్రజా ప్రతినిధులు శ్రమించాలని సూచించారు. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువని తెలిపారు. విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగానే వినూత్న చట్టాలు తీసుకొచ్చినట్లు వివరించారు. చట్టాలను కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదేనని పేర్కొన్నారు. భూ క్రమబద్దీకరణ పైసలతో ఖజానా నింపుకునే యోచన లేదని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునేలోగా అనేక చర్యలు చేపడతామన్నారు. భూములు, ఆస్తుల సమస్యలకు విధానపరమైన పరిష్కారాలు, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నవాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు చెందిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్లైన్లో నమోదు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.

కొత్త చట్టాలతో నిరుపేదలకు బాధ కలగొద్దు కేసీఆర్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *