Top Ad unit 728 × 90

కొత్త చదువు, వెంటనే కొలువు...!

కొత్త చదువు, వెంటనే కొలువు...!

 

  • బీఆర్‌ఏయూలో ఉపాధి కోర్సులకు శ్రీకారం
  • వర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసిస్తున్న విద్యార్థులు

 

అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా అంబేడ్కర్‌విశ్వవిద్యాలయం అధికారులు కొత్త కోర్సుల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. చదువు పూర్తయిన వెంటనే తగిన నైపుణ్య సాధించి విద్యార్థులు కొలువు సాధించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పీజీ డిప్లొమా ఇన్‌ పోర్టు ఆపరేషన్స్‌ అండ్‌ టెర్మినల్‌ మేనేజ్‌మెంట్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, పీజీ డిప్లొమా ఇన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అండ్‌ ఇండస్ట్రీ సేఫ్టీ వంటి నూతన కోర్సులను అందించనున్నారు.


ఉత్తరాంధ్రలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న సంస్థలు, పరిశ్రమలు, ఇతర అభివద్ధి కార్యకలాపాల్లో ఉద్యోగావకాశాలకు అవసరమయ్యే నైపుణ్యాలు కలిగిన కోర్సులు వర్సిటీలో ప్రారంభకానున్నాయి. భావనపాడు పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌, భోగాపురం ఎయిర్‌పోర్టు, ఫార్మారంగ పరిశ్రమల్లో యువత ఉద్యోగాలు పొందేలా కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే పలు సంస్థలతో ఎంవోయూ (ఒప్పందాలు) పూర్తి చేసుకుని, వాటి ఆధారంగా కోర్సులు నిర్వహించాలని చూస్తున్నారు. అంగన్‌వాడీ సిబ్బందిలో బోధనా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో 'ఎర్లీ ఛైల్డ్‌హుడ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌' పేరుతో ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సును ఈ మధ్య ప్రారంభించారు. ఇప్పటికే ప్రకటన విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేశారు. కొద్దిరోజుల్లో ప్రవేశాలు కల్పించి తరగతులు నిర్వహిస్తారు. కోర్సుకు సంబంధించి పూర్తి వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పాఠ్యప్రణాళిక రూపకల్పనకు కమిటీ...


వర్సిటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంబించనున్న పీజీ డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సుల పాఠ్యప్రణాళిక రూపకల్పనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీ అధ్యక్షునిగా ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ వీసీ, ఏయూ స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విశ్రాంత ఆచార్యులు డా.జి.నాగేశ్వరరావు ఉన్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఇంజినీరింగ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఆచార్యులు బి.వెంకటేశ్వరరావు, అరబిందో ఫార్మా, అగ్రికెం పరిశ్రమ, ఆదిత్యా విద్యాసంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించారు. వీరు ఇప్పటికే ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించేలా పాఠ్యాంశాలు, ప్రయోగాలతో కరికులమ్‌, ఫీజుల వివరాలతో నివేదిక సిద్ధం చేసి వర్సిటీకి అందజేశారు. కోర్సుల ప్రారంభానికి వర్సిటీ పాలమండలిలో అనుమతులు సైతం తీసుకున్నారు.


త్వరలో ప్రకటన...


జిల్లా యువతకు ఉన్నత విద్యతో పాటుగా మార్కెట్‌లో ఉన్న ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనే నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాం. త్వరలో అన్ని కోర్సులకు సంబంధించి ప్రకటన విడుదల చేస్తాం. ఉన్నత విద్యామండలి అన్ని కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా ఉపాధి పొందే నైపుణ్యాలతో విద్యార్థులను బయటకు పంపించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. -డా.నిమ్మ వెంకటరావు, ఉపకులపతి, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం
అవకాశాలు ఇలా...


* కృష్ణపట్నం అకాడమీ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ స్టడీస్‌ సంస్థ సహకారంతో ఏడాది కాలవ్యవధి గల మూడు పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నారు. వీటిల్లో ఒక్కో కోర్సుకు 35 సీట్లు చొప్పున అందుబాటులో ఉంటాయి. ప్రవేశాలకు త్వరలో ప్రకటన వెలువడనుంది.


* వర్సిటీ దాని అనుబంధ పీజీ కళాశాలల్లో ఎంఎస్సీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ సహకారంతో నాలుగు నెలల ఇంటర్న్‌షిప్‌ చేసుకొనేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకొన్నారు. పీజీ రెండో సంవత్సనం నాలుగో సెమిస్టర్‌లో ఈ ఇంటర్న్‌షిప్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. 'క్వాలిటీ కంట్రోల్‌ ఎనలిటికల్‌ టెక్నిక్స్‌' అనే అంశంపై ఈ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.


* నాగార్జున అగ్రికెం పరిశ్రమ సహకారంతో ఎమ్మెస్సీ కెమికల్‌ టెక్నాలజీ కోర్సు బోధించనున్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్ల కాలవ్యవధిగల ఈ పీజీ కోర్సులో 50 శాతం సీట్లు పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులకు.. మిగిలిన 50 శాతం వర్సిటీ విద్యార్థులకు కేటాయిస్తారు.


* ఆదిత్య గ్రూపు విద్యాసంస్థల సహకారంతో బీఎస్సీలో డేటా సైన్స్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులను ప్రారంభిస్తున్నారు.

 

కొత్త చదువు, వెంటనే కొలువు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *