ఉజ్జయిని మహాకాళి బోనాలకు 175 ప్రత్యేక బస్సులు...!
ఉజ్జయిని మహాకాళి బోనాలకు 175 ప్రత్యేక బస్సులు...!
హైదరాబాద్ సిటీ: ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళిబోనాలకు గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఎంజీబీఎస్, కాచిగూడ రైల్వేస్టేషన్, జూబ్లీబ్‌సస్టేషన్, చార్మినార్, బాలాజీనగర్, నాంపల్లి, రిసాలాబజార్, వెంకటాపురం, ఓల్డ్ అల్వాల్, మెహిదీపట్నం, కుషాయిగూడ, చర్లపల్లి, హకీంపేట, ఓల్డ్ బోయిన్‌పల్లి, చార్మినార్, సైనిక్‌పురి, సనత్‌నగర్, జామై ఉస్మానియా, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, బోరబండ, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ కు రెండు రోజులపాటు 175 ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడుపుతుందని ఆయన పేర్కొన్నారు.
స్పెషల్ సర్వీసుల నిర్వహణ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు క్యాంప్ ఇన్‌చార్జిలను నియమించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(రాణిగంజ్ డీఎం-9959226147), జేబీఎస్(కంటోన్మెంట్ డీఎం-9959226143), ఎంజీబీఎస్(కాచిగూడ డీఎం-99592 26130), స్పెషల్ ఆపరేషన్స్ పూర్తి నిర్వహణ ఇన్‌చార్జీగా సికింద్రాబాద్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ (9959226142)ను నియమించారు. ప్రత్యేక బస్సులు, ఇతర వివరాల కోసం రేతిఫైల్ బస్టాండ్-9959226154, కోఠి-9959226160లో కమ్యూనికేషన్ సెంటర్లను సంప్రదించవచ్చని తెలిపారు.