Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

కుబేరుల జాబితాలో అంబానీ ఆరో స్థానం...! బ్యాంక్ అకౌంట్ తెరిచే ముందు ఈ చార్జీల గురించి తప్పక తెలుసుకోండి…! ఉప్పు గురించి సంపూర్ణ వివరణ…! ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 15 జూలై 2020 3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..?   

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హోం క్వారంటైన్ మార్గదర్శకాలు...!

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హోం క్వారంటైన్ మార్గదర్శకాలు...!

 

తెలంగాణ ప్రభుత్వం హోం క్వారంటైన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. గాలి, వెలుతురు ఉన్న గదిలో రోగిని ఉంచాలని, అతనికి ప్రత్యేకమైన మరుగుదొడ్డి ఉండాలని తెలిపారు. రోగి ఉంటున్న ఇంట్లో చిన్నారులు, 55 సంవత్సరాల పైబడినవారు, గర్భిణీలు ఉండకూడదన్నారు. రోగి వాడిన బెడ్‌షీట్స్, టవర్స్‌ను డెట్టాల్‌ వేసి అరగంట నానబెట్టాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు. రోగికి సేవలందించే వారు 3 పొరల మెడికల్‌ మాస్క్‌ ధరించాలన్నారు. రోగితో ఉన్నప్పుడు ముక్కు, నోరు, కళ్లు తాకవద్దని తెలిపారు. రోగికి సేవలందించడానికి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత 40నుంచి 60 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలని పేర్కొన్నారు. రోగి వాడిన ఏ వస్తువునైనా 30 నిమిషాల పాటు వేడి నీళ్లలో ఉంచి శుభ్రం చేయాలని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు వైద్యుల సూచనల మేరకు హైడ్రాక్సిక్లోరోక్విన్‌ టాబ్లెట్స్‌ తీసుకోవాలన్నారు. రోగి ప్రతిరోజు తనని తాను గమనించుకుంటూ ఉండాలని, ప్రతిరోజు జ్వరంతోపాటు పల్స్‌రేట్‌ చేక్‌ చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. వ్యాధి లక్షణాలు కనిపించినా లేదా వ్యాధి నిర్ధారించిన వ్యక్తి 17రోజులపాటు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలని సూచించారు.

కరోనా సోకిన వ్యక్తి బ్రౌన్ రైస్‌, గోధుమపిండి, చిరుధాన్యాలు తీసుకోవడం మంచిదన్నారు. ఆహారంలో బీట్‌రూట్‌, క్యారెట్‌తో పాటు పండ్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే రోజుకు కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగాలని, వెన్న తీసిన పాలు, పెరుగును తీసుకోవడం మంచిదని గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హోం క్వారంటైన్ మార్గదర్శకాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *