Top Ad unit 728 × 90

మీ రాశిఫలాలు నవంబర్ 14 గురువారం 2019

మీ రాశిఫలాలు నవంబర్ 14 గురువారం 2019

మేష రాశి: ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కంటికి లేదా ఉదరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వృత్తి పరంగా మార్పులు ఉంటాయి. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి: ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు. మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం అలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగత్త అవసరం.

మిథున రాశి: ఈ రోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు కారణంగా డబ్బు పోగొట్టుకునే అవకాశముంటుంది.

కర్కాటక రాశి: ఈ రోజు ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి చేయగలుగుతారు. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీరు అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతారు. ధనలాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు.

సింహ రాశి: ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో సామరస్య పూర్వకంగా వ్యవహరించటం మంచిది. మీ అజాగ్రత్త కారణంగా వారి కోపానికి గురయ్యే అవకాశమున్నది. వారితో వాదనకు దిగకండి. మాట విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడికి గురి కాకండి.

కన్యా రాశి: ఈ రోజు మీ స్నేహితులతో, బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. గృహ సంబంధ లావాదేవీలు పూర్తి చేస్తారు. ప్రయాణాలకు అనుకూల దినం.

తులా రాశి: ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

వృశ్చిక రాశి: ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాదాలు లేదా కోర్టు కేసులు పరిష్కారానికి వస్తాయి. మిమ్మల్ని వ్యతిరేకించిన వారు మనసు మార్చుకొని మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికందుతుంది.

ధనుస్సు రాశి: ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకర రాశి: ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభ రాశి: మీరు చేపట్టే పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి. ము ఖ్యంగా మీ కార్యాలయంలో మీరు చేయాలనుకున్న పనికి సహోద్యోగుల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఆవేశానికి లోను కాకుండా సామరస్య పూర్వకంగా వ్యవహరించండి. శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విశ్రాంతి అవసరం.

మీన రాశి: ఈ రోజు మీ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో కాని, స్థలంలో కానీ మార్పులు ఉంటాయి. పుణ్యక్షేత సందర్శన చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!     

మీ రాశిఫలాలు నవంబర్ 14 గురువారం 2019 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *