Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 15 జూలై 2020 3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..? బీహార్‌లో సంపూర్ణ లాక్ డౌన్…! ఆకాశంలో అరుదైన దృశ్యం, భారత్‌కి దగ్గరగా తోకచుక్క...! అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ విండోస్ 10కి వచ్చింది చూశారా...!   

ఈ పండుతో మీ ఆరోగ్యానికి కల్పవృక్షం.

ఈ పండుతో మీ ఆరోగ్యానికి కల్పవృక్షం.

తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్లు అంటూ చిన్నపిల్లలకు పొడుపు కథలు చెపుతాం. దాని విశిష్టతను తెలుపుతూ తెలుగులో పద్యాలు కూడా ఎన్నో. కానీ ఇప్పుడిప్పుడే ఆ పండు రుచి తెలుగు ప్రజలకు మరింత దగ్గరవుతోంది. ఇంతకీ ఆ పండు ఏంటి ..!  దాని విశిష్టతలు ఏంటి.. .! ఆరోగ్యానికి ఆ పండు ఎంతలా మేలు చేస్తుంది ..!  ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

పనస... ఈ పండులోనే ఓ పస ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే తెలుగు ప్రజలు తెలుసుకుంటున్నారు. పాశ్చాత్య దేశాలు ఇప్పటికే పనసపై మక్కువ పెంచుకోగా మన దేశంలో ఇప్పుడిడప్పుడే ఈ పండుపై మనసు పడేసుకుంటున్నారు. ఆపిల్ అంత అందంగా కనిపించకపోయినా... ఆపిల్ కంటే ఎక్కువగానే పోషక విలువలను అందిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తుంది పనస పండు.

ఇక ఈ పండులో కేవలం గుజ్జు మాత్రమే కాదు చెట్టు కాండం నుండి కాయ వరకు అన్ని ఆరోగ్యానికి ఔషదాన్ని ఇచ్చేవే. మొత్తానికి పనస ఒక కల్పవృక్షం. ఆ పండులో తొనలే కాదు, పై తొక్క, పిక్కలు, చెట్టు ఆకులు, బెరడు, దాని కర్ర... ఇలా ప్రతీ భాగమూ అత్యంత విలువైనవి. ఇప్పుడే ఇవే చిత్తూరు వ్యాపారులకు కోట్లను కుమ్మరిస్తున్నాయి. పనస పరిపూర్ణ ఆహారానికి మరో రూపం అనే చెప్పాలి. ఈ పండులో అత్యధికంగా ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్‌ ఏ సమృద్ధిగా లభిస్తుంది.. ఒక కప్పు అన్నం  కంటే కప్పు పనస తొనల్లో కార్బోహైడ్రేట్లు 40% తక్కువగా ఉంటాయి. ఇక ఫైబర్‌ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

వీగన్‌ డైట్‌ కి పనస బ్రాండ్. వీగన్ డైట్ అంటే పూర్తిగా మొక్కల మీద పండిన ఆహారమే. ఈ మధ్య కాలంలో క్రీడాకారులందరూ వీగన్‌ డైట్‌ను తెగ ఫాలో అవుతున్నారు. భారత్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ కూడా వీగన్‌గా మారారు కూడా. ఇక తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరుతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్ లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. ఏపీలో మొత్తం 1197 హెక్టార్లలో, ప్రతీ సంవత్సరం ఇంచుమించుగా 41 వేల మిలియన్‌ టన్నుల పంట పండుతుంది.

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!

ఈ పండుతో మీ ఆరోగ్యానికి కల్పవృక్షం. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *