Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన 'దోస్త్‌' గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఇప్పటికే పూర్తయింది. దీనిని ఈనెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.  పంచాంగం: అక్టోబర్ 27, 2020  మంగళవారం | తిధి: ఏకాదశి ఉ 11:31 తదుపరి ద్వాదశి | నక్షత్రం: శతభిషం ఉ 8:27 తదుపరి | పూర్వాభాద్ర | యోగం: ధృవ రా 3:13 | కరణం: భద్ర ఉ :11:33 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6:10 | సూర్యాస్తమయం: 5:48 | రాహుకాలం: మ 3:00 - 4:40 | యమగండం: ఉ 9:00  - 10:30 | వర్జ్యం: మ 3:19- 5:03 | దుర్ముహూర్తం: ఉ 8:21 - 9:13 & రా 11:09 - 11:53 | అమృతకాలం: రా 12:19 - 2:06 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

కరోనాతో అణు శాస్త్రవేత్త పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత...!

కరోనాతో అణు శాస్త్రవేత్త పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత...!

 

కోల్కతా ప్రముఖ అణు శాస్త్రవేత్త అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ శేఖర్ బసు కరోనా మహమ్మారితో గురువారం తెల్లవారు జామున కోల్కతా లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. కరోనాతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలతో సతమతమౌతున్న ఆయన చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4.50 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారని అధికారులు తెలిపారు. మెకానికల్ ఇంజినీర్ అయిన శేఖర్ బసు దేశంలో తొలి అణు జలాంతర్గామి ఐఎస్ఎస్ అరిహంత్ తయారీలో కీలక పాత్ర వహించారు. దేశంలో అణువిద్యుత్ పెంచేందుకు కృషి చేశారు. 2015 అక్టోబర్ 23 నుంచి 2018 సెప్టెంబర్ 17 వరకు అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్గా పనిచేశారు. బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2014 లో పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది.

కరోనాతో అణు శాస్త్రవేత్త పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *