Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

ఉప్పు గురించి సంపూర్ణ వివరణ…! ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 15 జూలై 2020 3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..? బీహార్‌లో సంపూర్ణ లాక్ డౌన్…! ఆకాశంలో అరుదైన దృశ్యం, భారత్‌కి దగ్గరగా తోకచుక్క...!   

మ్యూజియంలో దొంగతనం ...! పక్కా స్కెచ్‌తో రూ.7100 కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ...!

మ్యూజియంలో దొంగతనం ...! పక్కా స్కెచ్‌తో రూ.7100 కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ...!

జర్మనీలోని డ్రెస్డెన్‌ నగరంలో భారీ చోరీ చోటు చేసుకుంది. డ్రెస్డన్ గ్రీన్ వాల్ట్ మ్యూజియంలోని వెలకట్టలేని వజ్రాలు పొదిగిన మూడు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రపంచంలోని పురాతన మ్యూజియంలలో ఒకటిగా పేరొందిన డ్రెస్డన్ గ్రీన్ వాల్ట్‌లో సోమవారం జరిగిన ఈ దొంగతనం యూరప్ వ్యాప్తంగా సంచలనమైంది. దొంగలు ఎత్తుకెళ్లినవి 18వ శతాబ్దానికి చెందిన అరుదైన ఆభరణాలు కావడం గమనార్హం.

వెలకట్టలేని అమూల్య సంపద...!

చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.7 వేల కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని జర్మన్ మీడియా చెబుతోంది. దొంగతనానికి గురైన ఆభరణాలను వెలకట్టడం సాధ్యం కాదని డ్రెస్డెన్స్ స్టేట్ ఆర్ట్ కలెక్షన్స్ డైరెక్టర్ మారియన్ అక్రెమన్ తెలిపారు. ఆభరణాలను ముక్కలు చేయొద్దొని ఆమె దొంగలకు పిలుపునిచ్చారు. 1723లో ఆగస్టస్ ది స్ట్రాంగ్ ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. దీనికున్న గ్రీన్ పెయింట్ వల్ల ఈ మ్యూజియానికి గ్రీన్ వాల్ట్‌ అనే పేరొచ్చింది.

భద్రతా సిబ్బంది వచ్చేలోపే...!

భద్రతా సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ దొంగలు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారు. దీంతో దొంగల వేట కోసం పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. చోరీకి పాల్పడిన వారు ఎక్కడికీ పారిపోకుండా వాహనాలను ఆపి తనిఖీలు చేపడుతున్నారు.

 

దొంగతనం జరిగిందిలా...!

సోమవారం వేకువజామున మ్యూజియంలోని ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సమీపంలో దొంగలు నిప్పు అంటించారు. తర్వాత మ్యూజియం అలారంను ఆపేశారు. పవర్ ఆగిపోవడంతో మ్యూజియం మొత్తం అంధకారం అలుముకుంది. పవర్ కట్ అయినప్పటికీ నిఘా కెమెరాలో చోరీ ఘటన రికార్డయ్యింది. డ్రెస్డన్ రాయల్ ప్యాలెస్‌లోని గ్రీన్ వాల్ట్‌లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఆభరణాలను ఉంచిన విండోను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!     

అన్నమయ్య కీర్తనలలో ఓ ఆణిముత్యం ఈ పాట విని తరించండి...!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అద్బుతమైన పాట మీ కోసం...!

స్వామి... నీ లీల తెలిసితే మోక్షమే...! ఈ పాట వినండి

మ్యూజియంలో దొంగతనం ...! పక్కా స్కెచ్‌తో రూ.7100 కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *