Top Ad unit 728 × 90

అక్కడికెళ్తే హోం ఐసోలేషన్‌ తప్పనిసరి...!

అక్కడికెళ్తే హోం ఐసోలేషన్తప్పనిసరి...!

 

కరోనా ఉద్ధృతి వేళ బీఎంసీ కీలక నిర్ణయం

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ముంబయి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబై నగరానికి వచ్చిన ప్రయాణికులెవరైనా 14 రోజులపాటు తప్పనిసరిగా హోం ఐసోలేషన్లో ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. మేరకు బృహాన్ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) శుక్రవారం ప్రకటన జారీ చేసింది. దేశంలో ఎక్కడి నుంచైనా ముంబయికి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉండాల్సిందేనని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా దీన్నుంచి మినహాయింపు పొందాలనుకుంటే మాత్రం రెండు రోజుల ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు బీఎంసీ ట్విటర్హ్యాండిల్లో పేర్కొన్నారు.

 

బాలీవుడ్నటుడు సుశాంత్సింగ్రాజ్పూత్మృతి కేసును విచారించేందుకు పట్నా నుంచి ముంబయికి వచ్చిన పోలీస్అధికారిని అధికారులు బలవంతంగా హోం క్వారంటైన్చేసిన ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజే 11514 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 4,79,779 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 3,16,375 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 16,792 మంది మృతి చెందారు.

 

అక్కడికెళ్తే హోం ఐసోలేషన్‌ తప్పనిసరి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *