Top Ad unit 728 × 90

చంద్రయాన్-2 జెస్ట్ మిస్ : 2022లో గగన్‌యాన్... 3 వ్యోమగాములతో మిషన్

చంద్రయాన్-2 జెస్ట్ మిస్ : 2022లో గగన్‌యాన్... 3 వ్యోమగాములతో మిషన్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం అసంపూర్తిగానే ముగిసింది. సెప్టెంబర్ 07న చంద్రుడిని ల్యాండర్ విక్రమ్ ఆర్బిటర్ నుంచి విడిపోయి అనుకోకుండా అదృశ్యమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే క్రమంలో ల్యాండర్ కమ్యూనికేషన్ కట్ అయింది. విక్రమ్ ల్యాండర్ ఏమైంది అనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

చంద్రునిపై ఒక ల్యూనర్ డే (భూమిపై 14 రోజులతో సమానం) సెప్టెంబర్ 20వ తేదీతో విక్రమ్ ల్యాండర్ కాల పరిమితి ముగిసింది. ఆర్బిటర్ మాత్రం తన కక్ష్యలో తాను తిరుగుతూనే ఉంది. ఇస్రో సాయంగా నాసా రంగంలోకి దిగినప్పటికీ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించ లేకపోయారు. ల్యాండర్ కు దాదాపు గుడ్ బై చెప్పేసినట్టుగానే ఇస్రో స్పష్టం చేసింది.

చంద్రుడిపై పగటి సమయం ముగస్తుందని, ఉష్ణోగ్రత మైనస్ 240 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుందని వెల్లడించారు. చంద్రయాన్-2 ప్రయోగం మిస్టరీగా ముగియడంపై ఇస్రో చైర్మన్ కే. శివన్ మాట్లాడుతూ విక్రమ్ ల్యాండర్‌తో ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారంతో విక్రమ్ ల్యాండర్ 14 రోజుల కాల పరిమితి ముగిసింది.

ల్యాండర్ ఇస్రోతో కాంటాక్ట్ మిస్ కావడానికి అసలు కారణం ఏమై ఉంటుందనే దానిపై ప్రీమియర్ స్పెస్ ఏజెన్సీ లోతుగా అన్వేషిస్తున్నట్టు ఆయన తెలిపారు. 'చంద్రయాన్-2 ఆర్బిటర్ బాగానే పనిచేస్తుంది. ఆర్బిటర్ లో మొత్తం 8 పరికరాలు ఉన్నాయి. ఒక్కో పరికరం నిర్దేశించిన పనిని కచ్చితంగా పూర్తి చేస్తాయి. ఇప్పటివరకూ ల్యాండర్ తో ఎలాంటి కమ్యూనికేషన్ చేయలేకపోయాం' అని ఇస్రో చైర్మన్ అన్నారు. ల్యాండర్ కు ఏమైందనే దానిపై ఇస్రో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

ఇక తదుపరి మిషన్ గగన్ యాన్ అని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాన్ మిషన్ లాంచ్ చేయబోతున్నట్టు తెలిపారు. 2022లో 'గగన్ యాన్' పేరుతో మానవులు నడిపే రాకెట్ ను షెడ్యూల్ చేసినట్టు తెలిపారు. చంద్రయాన్-2లో చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను సేఫ్ ల్యాండింగ్ చేయడం గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములును (మనుషులను) అంతరిక్షంలోకి పంపి.. వారిని తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావడం తప్పనిసరి అన్నారు.

2022 నాటికి ముగ్గురు భారతీయ వ్యోమగాములుతో గగన్ యాన్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గగన్ యాన్ ప్రయోగించనున్నట్టు ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ఇస్రో ఆధిత్య L-1, భారత తొలి సోలర్ మిషన్ ప్రయోగాన్ని లాంచ్ చేయనుంది. అంగారకుడు, శుక్ర గ్రహాల మధ్య స్పెస్ స్టేషన్ నిర్మించడమే కాకుండా గ్రహాంతర మిషన్లను లాంచ్ చేసేందుకు ఇస్రో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ప్రపంచలోనే టాప్ అంతరిక్ష సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ర్ట్రేషన్) ఇస్రాకు సాయం చేసేందుకు తమ ల్యూనర్ రీకన్షియేషన్స్ ఆర్బిటర్ (LRO)తో రంగంలోకి దిగింది. అదృశ్యమైన రోవర్ ల్యాండర్ విక్రమ్ ఆచూకీ తెలుసుకునేందుకు LROను పంపింది. నాసా ఆర్బిటర్ విక్రమ్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే ప్రాంతాన్ని ఫొటోలు తీసింది. ఆ ఫొటోల్లో ల్యాండర్ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. చంద్రునిపై షాడోల కారణంగా విక్రమ్ కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించడంలో నాసా విఫలమైంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

చంద్రయాన్-2 జెస్ట్ మిస్ : 2022లో గగన్‌యాన్... 3 వ్యోమగాములతో మిషన్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *