Top Ad unit 728 × 90

వంశపారంపర్య అవినీతి మన దేశానికి పట్టిన చెద...!

వంశపారంపర్య అవినీతి మన దేశానికి పట్టిన చెద...!

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన దేశంలో అవినీతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వంశపారంపర్య అవినీతి మన దేశాన్ని లోలోన తొలిచేస్తున్న చెద వంటిదని పేర్కొన్నారు. ఒక తరం నుంచి మరొక తరానికి పాకుతున్న అవినీతి మన దేశాన్ని చెదలా తొలిచేస్తోందన్నారు. సంస్థాగత నిరోధాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పరిపూర్ణ దృక్పథంతో మనమంతా కలిసి కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్వహిస్తున్న మూడు రోజుల సదస్సును ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అవినీతి, ఆర్థిక నేరాలు, మాదక ద్రవ్యాలు, మనీలాండరింగ్, ఉగ్రవాదం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటివన్నీ ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నవేనని చెప్పారు. వ్యవస్థాగత నిరోధాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పరిపూర్ణ దృక్పథంతో మనమంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమగ్ర ఆడిట్, కెపాసిటీ బిల్డింగ్, శిక్షణ వంటివాటి ద్వారా అవినీతిని నిర్మూలించాలన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానం గురించి మాట్లాడుతూ, మన దేశం కుంభకోణాల శకం నుంచి బయటపడిందన్నారు. డీబీటీ ద్వారా పేదలు నూటికి నూరు శాతం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారన్నారు. వారు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోనే లబ్ధి పొందుతున్నారని చెప్పారు. విధానం వల్ల అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళకుండా రూ.1.70 లక్షల కోట్లు ఆదా అయిందని తెలిపారు.

వంశపారంపర్య అవినీతి మన దేశానికి పట్టిన చెద...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *