Top Ad unit 728 × 90

కొమరం భీమ్ మనవడి మాటకు రాజమౌళి జవాబేంటి...!

కొమరం భీమ్ మనవడి మాటకు రాజమౌళి జవాబేంటి...!

 

'ఆర్ఆర్ఆర్‌'లో కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం వేషధారణలో కనిపించడంతో, కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్కు చెందిన ఆదివాసీలు తమ ఆగ్రహాన్ని, అసంతృప్తినీ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్వయంగా కొమరం భీమ్ మనవడు సోనే రావ్ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో వైరల్ అయిన వీడియోలో ఆయన, "కొమరం భీమ్ జల్‌, జంగిల్‌, జమీన్ కోసం పోరాడిన చరిత్ర అందరికీ తెలుసు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భీమ్ చరిత్ర గురించి మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు ఇచ్చేవాళ్లం. ముస్లిం వేషంలో కొమరం భీమ్ను చూపించడం మా ఆదివాసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మేం దేవుడిగా కొలిచే కొమరం భీమ్ను విధంగా చూపించడం ఆదివాసీలందరినీ కించపరచడమే." అని చెప్పారు. తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ముస్లిం వేషాన్ని తొలగించాల్సిందిగా రాజమౌళిని కోరుతున్నామని ఆయన తెలిపారు. "దాన్ని తొలగించకుంటే సినిమాను అడ్డుకుంటాం." అని హెచ్చరించారు సోనే రావ్‌. అంతకుముందు కొమరం భీమ్ను ముస్లిం వేషంలో చూపించిన సీన్ను తొలగించాలని ప్రకటనలో ఆదిలాబాద్ ఆదివాసీలు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. "నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాడారు. నిజాం సైన్యానికి వ్యతిరేకంగా తన చివరి శ్వాస దాకా ఆయన నిలబడ్డారు. కొమరం భీమ్ ముస్లిం టోపీని పెట్టుకున్నట్లు రాజమౌళి ఎందుకు చూపించారు? ఇది వేలాదిమంది ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసింది. చరిత్ర పేరుతో ఇలాంటి అబద్ధాలు తీస్తారా? ఆయన సినిమా తియ్యాలనుకుంటే, ఆడవాళ్ల బొడ్డులను చూపించుకోమనండి. మా దేవుడ్ని ఎందుకు కించపరచాలి? కొమరం భీమ్ను అలా చూపించడాన్ని రాజమౌళి తొలగించకపోతే, మేం ఆయన సమాధిని తవ్వుతాం" అని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. 'రామరాజు ఫర్ భీమ్' టీజర్లో జూనియర్ ఎన్టీఆర్ను ముస్లిం వేషంలో చూపించడం వల్ల విమర్శలు, వివాదాలు తలెత్తుతాయనే విషయం రాజమౌళికి తెలియంది కాదు. బహుశా దాన్ని కోరుకొనే, కాంట్రవర్సీ సినిమాకు ఉపకరిస్తుందనే నమ్మకంతోనే ఆయన టీజర్ను ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారని ఫిల్మ్నగర్ వర్గాలు భావిస్తున్నాయి. వివాదం మలుపు తీసుకుంటుందో, రాజమౌళి దీన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

కొమరం భీమ్ మనవడి మాటకు రాజమౌళి జవాబేంటి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *