Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి-డా. యర్రం పూర్ణశాంతి భారతీయ రైల్వే పండ్లు, కూరగాయలను రవాణా చేయడానికి ఇవాళ (ఆగస్టు 7) తన మొదటి 'కిసాన్ రైల్' సేవను ప్రారంభించబోతోంది. ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదిగ్రాముల పసిడి ఏకంగా 57,008 రూపాయలకు పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు 576 రూపాయలు భారమై 77,840 రూపాయలు పలికింది. లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 123 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి కొత్త గెటప్ తో ఏ చానెల్ వస్తున్నాడో తెలుసా…!

బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి కొత్త గెటప్ తో ఏ చానెల్ వస్తున్నాడో తెలుసా…!

 

బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి ఇటీవలే టీవీ9కు రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే టీవీ9 కావాలనే సత్తిని పంపేసిందని, లేదు అతనే రాజీనామా చేశాడని, కాదు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు రాజీనామా చేశాడని అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటికి తెరదించుతూ సత్తి కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇకపై అతను సాక్షి టీవీలో కనిపించనున్నాడు. ఈ మేరకు ఆ టీవీ చానల్‌ యాజమాన్యంతో సత్తి డీల్‌ కన్‌ఫాం అయినట్లు తెలుస్తోంది.

 

గతంలో టీవీ9 వారు అందజేసిన ప్యాకేజీ మొత్తానికే సత్తి ఓకే చెప్పాడని సమాచారం. దీంతో సత్తి ఇక సాక్షి టీవీలో కనిపించనున్నాడు. అయితే అందులో కూడా ఇస్మార్ట్‌ వార్తల పేరిటే ఏదైనా కార్యక్రమం పెడతారని తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు వీ6 న్యూస్‌, టీవీ9లలో సత్తి రెండు భిన్న గెటప్‌లలో అలరించాడు. కానీ సాక్షిలో మరో కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నట్లు తెలిసింది. తనదైన శైలితో అలరిస్తూనే సరికొత్త అవతారంతో కనిపించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

 

అయితే టీవీ9 నుంచి బయటకు వచ్చాక సత్తి బిగ్‌బాస్‌ షోలోనే పాల్గొంటాడని అందరూ అనుకున్నారు. కానీ దాని కన్నా ముందుగానే అతను సాక్షిలో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బిగ్‌బాస్‌ గనక ప్రారంభమైతే అందులో సత్తి పాల్గొంటాడా లేదా అన్నది సందేహంగా మారింది. కానీ అందుకు సాక్షి మాత్రం అడ్డు కాబోదని తెలుస్తోంది. బిగ్‌బాస్‌లో సత్తి పాల్గొనే అవకాశం ఉంటే సాక్షి అతనికి అందుకు అనుమతి ఇస్తుండవచ్చని సమాచారం. ఇక ఈ విషయంపై మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా, సత్తి మరో చానల్‌లో ప్రేక్షకులను లరించేందుకు సిద్ధమడం అతని ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్నిస్తోంది...!

 

బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి కొత్త గెటప్ తో ఏ చానెల్ వస్తున్నాడో తెలుసా…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *