Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..? బీహార్‌లో సంపూర్ణ లాక్ డౌన్…! ఆకాశంలో అరుదైన దృశ్యం, భారత్‌కి దగ్గరగా తోకచుక్క...! అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ విండోస్ 10కి వచ్చింది చూశారా...! విశాఖ ఫార్మాసిటీలో పేలుడుపై ఏపీ మంత్రి ఆరా…!   

వోడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం…!

వోడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం…!

 

ఏజీఆర్‌ వివాదంలో చిక్కుకున్న టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) సంబంధిత బకాయిలను రాబోయే కొద్ది రోజుల్లో టెలీకమ్యూనికేషన్ విభాగానికి (డాట్‌) జమ చేయనున్నట్లు వోడాఫోన్ ఐడియా శనివారం తెలిపింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారాన్ని అందించింది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, డాట్‌ విధించిన డెడ్‌లైన్‌ నేపథ్యంలో వోడాఫోన్‌ ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై ఏర్పడ్డ సంక్షోభం నేపథ్యంలో కంపెనీ బోర్డు ప్రత్యేకంగా సమావేశ మైంది.

 

డాంట్‌ అంచనాల ప్రకారంవోడాఫోన్ ఐడియా బకాయిలు మొత్తం రూ .53,038 కోట్లు. వీటిలో రూ.24,729 కోట్ల స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కాగా, లైసెన్స్ ఫీజు రూ.28,309 కోట్లు. మరోవైపు శుక్రవారం అర్థరాత్రిలోపు బకాయిలు చెల్లించాలని డాట్‌ విధించిన గడువుపై తక్షణమే స్పందించిన మరో దిగ్గజ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ఫిబ్రవరి 20న రూ. 10వేల కోట్లు, కోర్టువిచారణ లోపు మిగిలిన మొత్తం చెల్లిస్తామని ప్రకటించింది.

 

కాగా టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో విలీనం తరువాత అతిపెద్ద సంస్థగా అవతరించిన వోడాఫోన్‌ ఇండియా భారీ అప్పుల్లో కూరుకుపోయింది. దీనికితోడు కస్టమర్ల సంఖ్య కూడా క్రమేపీ క్షీణిస్తోంది. దీనికి ఏజీఆర్‌ బకాయిల అంశం అగ్నికి ఆజ్యంలా తోడైంది. ఈ నేపథ్యంలోనే తమకు ఉపశమనం కల్పించకపోతే కంపెనీనీ మూసుకోవాల్సి వస్తుందని ఇటీవల వ్యాఖ్యానించింది. ఇది ఇలా వుండగా తాజాగా వరుసగా ఆరవ త్రైమాసికంలో కూడా కంపెనీ నష్టాలనే ప్రకటించింది. 2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో, రూ .6,439 కోట్ల నికర నష్టాన్ని మూట గట్టుకుంది. అటు స్టాక్‌మార్కెట్లో కంపనీ షేరు భారీగా పతనమైంది. ఏజీఆర్‌ సంక్షోభంతో కంపెనీ దివాలా ప్రకటిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యాపించాయి. మొండిపద్దుల గుదిబండ తమ మెడకుచుట్టుకుంటుందనే ఆందోలన అటు బ్యాంకింగ్‌ రంగంలో కూడా నెలకొంది. టెలికాం కంపెనీలు రూ 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏదైనా కంపెనీ దివాలా ప్రకటిస్తే, దానికి బ్యాంకులు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజా ప్రకటనతో ఈ అంచనాలకు తెరపడింది. ఏజీఆర్‌ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 17వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

 

వోడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *