Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 20 జూన్ 2024 

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 20 జూన్ 2024 

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీపేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు బంధు మిత్రులతో మాటపట్టింపులు  ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా  సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమపెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి  ఫలితం కనిపించదు. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోభాధలు అధికమౌతాయి. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక  ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు పని ఒత్తిడి నుండి  బయటపడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు ఒక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం మందకొడిగా సాగుతుంది. దూరప్రయాణాలలో మార్గ  అవరోధాలు కలుగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారపరంగా నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది ధన వ్యవహారాలు కలిసివస్తాయి. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూరప్రయాణ  సూచనలు ఉన్నవి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా భాదిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు  కలసిరావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి,  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 20 జూన్ 2024  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *