Top Ad unit 728 × 90

రెట్రో కేసు తీర్పుపై భారత్‌ సవాల్‌...!

రెట్రో కేసు తీర్పుపై భారత్సవాల్‌...!

 

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్చెల్లించాల్సిన రూ.20 వేల కోట్ల రెట్రోస్పెక్టేటీవ్పన్ను కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌) తీర్పును భారత్సవాల్చేయనుంది. మేరకు సొలిసిటర్జనరల్తుషార్మెహతాను న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది. స్థానిక పార్లమెంట్రూపొందించిన చట్టాలను దాటి మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు ఇవ్వకూడదని తుషార్మెహతా అన్నారు. ది హేగ్లోని అంతర్జాతీయ మధ్యవర్తి్త్వ న్యాయస్థానం రెట్రోస్పెక్టేటివ్కేసులో గత నెలలో వొడాఫోన్కు అనుకూలంగా తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆదాయపన్ను శాఖ పారదర్శకంగా, సమానంగా చూడటంలో విఫలమైందంటూ వొడాఫోన్పై భారత ప్రభుత్వం పన్ను విధించడం అహేతుకం అని పేర్కొంది. ఇది భారత్‌-నెదర్లాండ్స్మధ్య పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని వాదించింది. వొడాఫోన్నుంచి బాకీల వసూలను తక్షణమే నిలిపి వేయాలని, అంతేకాకుండా కోర్టు ఖర్చుల కింద రూ.40 కోట్లు చెల్లించాలని ఆదేశించిందిభారత్లో టెలికాం సేవలు అందిస్తున్న హచిసన్ఈక్విటీలో 67 శాతం వాటాను వొడాఫోన్‌ 2007లో 1,100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. దీనికి టీడీఎస్కింద రూ.11,000 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. వొడాఫోన్ మొత్తం చెల్లించక పోవడంతో జరిమానా, వడ్డీలతో మొత్తాన్ని రూ.19,900 కోట్లకు పెంచారు. 2012 జనవరిలో ఐటీ శాఖ డిమాండ్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పాత తేదీలతో వర్తించేలా చట్టాన్ని సవరించి మళ్లీ వొడాఫోన్గ్రూప్నకు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దాంతో వొడాఫోన్‌ 2014లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని అశ్రయించింది.

 

రెట్రో కేసు తీర్పుపై భారత్‌ సవాల్‌...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *