Top Ad unit 728 × 90

ఎన్నికల ప్రక్రియ అపహాస్యం

ఎన్నికల ప్రక్రియ అపహాస్యం

విజయవాడ: తన 40ఏళ్ల రాజకీయానుభవంలో ఎప్పుడూ చూడనంత ధన ప్రవాహం ఈ సార్వత్రిక ఎన్నికల్లో కనిపించిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఒక పెద్దనోటు రద్దు చేసి అంతకంటే పెద్దనోటు ప్రవేశపెట్టడంతో ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగిందని దుయ్యబట్టారు. డిజిటల్‌ కరెన్సీని పూర్తిస్ధాయిలో అమలులోకి తేవడమే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వతంత్రత పెంపొందించడపై ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి డిజిటల్‌ కరెన్సీ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. డిజిటల్‌ కరెన్సీపై తాను చేసిన సూచనలను కేంద్రం పట్టించుకోలేదని అన్నారు.

అసలు ఏ ప్రయోజనాలు ఆశించి ఒక పెద్దనోటు రద్దు చేసి మరో పెద్దనోటు తీసుకొచ్చారు? ఎన్నికల్లో యధేచ్చగా డబ్బు పంపిణీ చేయడం కోసం కాదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.ఓటుకు ఇచ్చే నోటు విలువ పెంచడం మినహా మరేం జరిగింది? అని నిలదీశారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. సాంకేతికత గొప్పదనాన్ని నరనరానా జీర్ణించుకునన తానే ఈవీఎంలతో పోలింగ్‌ ప్రక్రియను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రస్తుత పోలింగ్‌ విధానాన్ని ప్రశ్నించడం వల్ల దేశంలో కొత్త మార్పునకు నాంది పలికామన్నారు. ఈవీఎంలను నిషేదించి బ్యాలెట్‌ విధానాన్ని తీసుకురావడం వల్ల సమాజానికి గొప్ప మేలు చేయడమే కాకుండా దేశానికి ఇదే గొప్ప వరమవుతుందని అన్నారు. ఈవీఎంల విధానానికి ఎన్నికల్లో 2009నుంచి నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ విధానంలో పారదర్శకతను పెంచడం కోసం వివిప్యాడ్‌లను వాడాలని ఎప్పుడో ప్రతిపాదించాం. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్‌ నాయకుల మాదిరి మేము మాట మాట మార్చి ఈవీఎంలను వాడకానికి మోగ్గు చూపవచ్చు. నాతో సహా దేశంలోని సీనియర్‌ నేతలంతా ఈవీఎంలను మొదటి నుంచి వ్యతిరేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన సింగపూర్‌ వంటి దేశం కూడా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించకుండా సాధారణ బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతినే అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఎన్నికల సంఘాన్ని తన చెప్పుచేతుల్లో ఆడిస్తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణిని ప్రశ్నించినందుకే తమపై ప్రతికార చర్యలకు దిగారని ఆరోపించారు.

ఎన్నికల నిర్వహణలో 50శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలన్న తమ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తిరస్కరించినప్పటికీ దీనిపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇదే విషయం మీద ఎన్నికల కమిషన్‌ను మరోసారి సంప్రదించగా, దీనివల్ల కౌంటింగ్‌ ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరుగుతుందన్న పాత అభ్యంతరాన్నే మళ్లీ లేవనెత్తారని చెప్పారు. వీవీప్యాట్లను కూడా ఈవీఎం టేబుల్‌ మీద పెట్టి సమాంతరంగా లెక్కిస్తే జాప్యాన్ని నివారించవచ్చనని, అవేమీ ఆలోచించకుండా ఏకపక్షంగా తిరస్కరించడం సరికాదన్నారు. ప్రస్తుతం కౌంటింగ్‌లో ఇది సాధ్యం కాకపోయినా తదుపరి జరిగే ఎన్నికల్లో దీన్ని అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల వల్ల నిధులు సమీకరణలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు దక్కుతాయని అనుకుంటే, అది నెరవేరకుండా పోయిందని అన్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఎన్నికల ప్రక్రియ అపహాస్యం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *