Top Ad unit 728 × 90

మార్కెట్ యార్డును ప్రారంభించిన శ్రీ మంచెం మైబాబు

మార్కెట్ యార్డును ప్రారంభించిన శ్రీ మంచెం మైబాబు

 

ఈరోజు కొమడవోలు మార్కెట్ యార్డులో గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారి ఆదేశానుసారం న్యూ వాలంటరీ ట్రేడర్స్ కి స్థలం కేటాయించి ఏలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ శ్రీ మంచెం మైబాబు గారి చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డు ఛైర్మన్ శ్రీ మంచెం మైబాబు గారు మాట్లాడుతూ, ఈరోజు ఆంధ్రరాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా గౌరవ డిప్యూటీ సిఎం ఆళ్ళ నాని గారు రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ వాలంటరీ ట్రేడింగ్ విధానాన్ని మన ఏలూరు మార్కెట్ యార్డులో అమలు చేసి ఏలూరు మార్కెట్ యార్డును ఒక గొప్ప మోడల్ మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దేందుకు డిప్యూటీ సిఎం ఆళ్ళ నాని గారు అన్ని విధాలా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు.

 

గతంలో న్యూ వాలంటరీ ట్రేడర్స్ కి స్థలాలు కేటాయిస్తామని డిప్యూటీ సిఎం ఆళ్ళ నాని గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి కట్టుబడి 40 మంది న్యూ వాలంటరీ ట్రేడర్స్ కి వ్యాపారం చేసుకునే నిమిత్తం ఈరోజు స్థలాలు కేటాయించడం జరిగింది అని మంచెం మైబాబు గారు తెలియజేశారు.

 

డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు ఎన్నికల్లో గాని, ఎన్నికల తరువాత గాని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు తూచా తప్పకుండా పాటిస్తూ ఏలూరు అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెడతారని అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు నిజాయితీగా అమలు చేయడంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఏలూరుని నిలబెట్టారని ఈ సందర్భంగా మంచెం మైబాబు గారు అన్నారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు వైయస్ ఆర్ సిపి టౌన్ ప్రెసిడెంట్ బొద్దాని శ్రీనివాస్ గారు, మాజీ MPP సుధీర్ బాబు గారు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ బత్తిన మస్తాన్ రావు, రైతుసఘ అధ్యక్షులు నాగం శివ, హమాలీ సంఘ ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్స్ బాలిబోయిన నవహర్ష, జక్కుల బెనర్జీ, బత్తిన విజయ్ కుమార్, జిజ్జువరపు విజయ నిర్మల, పల్లెల గంగా నాగమణి, చీలి ఆనందమ్మ, బాలిన ధనలక్ష్మి, మహమ్మద్ మున్నీ, దేవరకొండ సూర్యవతి, అద్దంకి హరిబాబు, లావేటి రామాంజనేయులు, భోగిశెట్టి పార్వతి, మడిపల్లి కళ్యాణి ప్రతీ ఒక్కరి చేతులమీదుగా 40 వ్యాపార స్థలాలను ఒక్కొక్కరూ ఒక్కొక్క వ్యాపార స్థలాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో న్యూ వాలంటరీ ట్రేడర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అన్నవరం, వైస్ ప్రెసిడెంట్ రంగముత్యాలు, కార్యదర్శి చేపేన కిరణ్, కోశాధికారి బోను వాసు, వైస్ ప్రెసిడెంట్ తన్నీరు బుజ్జి, అక్బర్, కార్పోరేటర్ కర్రి శ్రీనివాస్, మార్కెటింగ్ A.D.  MDV శ్రీనివాస్, మార్కెటింగ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి CH రాజశేఖర్, మార్కెటింగ్ కార్యదర్శి ARK ప్రకాష్, మార్కెటింగ్ సూపర్వైజర్ గౌరీ శంకర్ మరియు ఇతర మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

 

సేకరణ: రవి పామర్తి, ఏలూరు.

మార్కెట్ యార్డును ప్రారంభించిన శ్రీ మంచెం మైబాబు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *