Top Ad unit 728 × 90

నేటి నుంచి జగన్‌ కేసుల విచారణ...!

నేటి నుంచి జగన్కేసుల విచారణ...!

 

ఏపీ సీఎం జగన్అక్రమాస్తుల కేసుల విచారణ మంగళవారం నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగనుంది. గత 3 వారాలుగా జరగాల్సిన విచారణ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 27 తేదీ నుంచి రోజువారీ విచారణ ఉంటుందని కోర్టు అధికారులు తెలిపారు. మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరం విచారించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగన్కేసుల విచారణ మొదలైంది. అయితే సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండడం, తర్వాత భారీ వరదలు, అనంతరం దసరా సెలవుల నేపథ్యంలో వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక నుంచి రోజూ విచారణ జరగనుండడంతో జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు అవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

 

నేటి నుంచి జగన్‌ కేసుల విచారణ...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *