Top Ad unit 728 × 90

మన భద్రత కోసం ఒక కొత్త యాప్: తెలంగాణ పోలీసులు

మన భద్రత కోసం ఒక కొత్త యాప్: తెలంగాణ పోలీసులు

  •  మన భద్రత కోసం ఒక కొత్త యాప్ ని రూపొందించారు తెలంగాణ పోలీసులు. దాని పేరే హాక్ ఐ.

రాష్ట్రాన్ని నేర రహిత సమాజంగా మార్చే క్రమంలో క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలు, పౌరుల భద్రతకు ఆ సర్వీసులను పోలీసు ప్యాట్రోల్‌ వాహనాలతో అనుసంధానించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టినట్లు సోమవారం జరిగిన మీడియా భేటీలో డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఈ సదుపాయం నగరానికే పరిమితమైనా, క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని అన్నారు.

నగరం విస్తరిస్తున్న దరిమిలా మ హిళా ఉద్యోగులు అన్ని వేళల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని, వారికి భద్రత కలి్పంచడం మనందరి బాధ్యత అని అన్నారు. ఆపద ఎదురైనా, ప్రమాదాల్లో చిక్కుకున్నా.. ఓలా, టోరా, రైడో, ఎం-వాలెట్, హాక్‌ ఐ యాప్‌ల్లో ఉన్న ఎస్‌ఓఎస్‌ (ఎమర్జెన్సీ) బటన్‌ను నొక్కితే చాలు సమీపంలోని ప్యాట్రోల్‌ వాహనాలు, బ్లూకోల్ట్స్, స్థానిక ఏసీపీ, డీసీపీ, స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ, మహిళ బంధువులకు సమాచారం అందుతుంది. ఫలితంగా సదరు క్యాబ్‌ డ్రైవర్‌ వివరాలు ఫోన్‌ నంబర్, బయోడేటా మొత్తం పోలీసులకు వచ్చేస్తుంది.

సమీపంలో ఉన్న గస్తీ వాహనాలు, పోలీసులు జీపీఎస్‌ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇందుకోసం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఓ ప్రత్యేకమైన బృందం 24 గంటలు పనిచేస్తుంది.

ఈ ప్రక్రియంతా ముగిసిన తరువాత ఎవరు ఎలా పనిచేసారో తెలుసుకునేందుకు థర్డ్‌ పార్టీ సర్వే ప్రతినిధులు బాధితులకు ఫోన్‌ చేస్తారు. మిగిలిన క్యాబ్‌ సంస్థలూ ముందుకువచ్చి ఈ విధానంలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలు, పౌరుల్లో హాక్‌ ఐ మీద అవగాహన పెరుగుతోందన్నారు. ఇప్పటివరకూ 22 లక్షల మంది హాక్‌ ఐని డౌన్‌లోడ్‌ చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు.

మన భద్రత కోసం ఒక కొత్త యాప్: తెలంగాణ పోలీసులు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *