Top Ad unit 728 × 90

విమర్శలకు తావిస్తున్న విద్యాశాఖ వైఖరి…!

విమర్శలకు తావిస్తున్న విద్యాశాఖ వైఖరి…!

 

PSLV TV నూజివీడు: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించడానికి పలు రకాల నిబంధనలు పాటిస్తున్న అధికారులు, ప్రైవేటు స్కూల్స్ విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

 

తిరువూరు నడిబొడ్డున ఉన్న ఒక కార్పొరేట్‌ స్కూలుకు కనీసం ఆటస్థలం కూడా లేకున్నా, కళ్లు మూసుకొని అనుమతులిచ్చేసిన అధికారులు గత 12 సంవత్సరాల నుండి వార్షికోత్సవ వేడుకలను కూడా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.

 

గత ఏడాది తహశీల్దారు కార్యాలయం ఆవరణలో పాఠశాల వార్షికోత్సవం కోలాహలంగా జరిపిన కార్పొరేట్‌ స్కూలు నిర్వాహకులు ఈ ఏడాది ఏకంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెద్ద ఎత్తున స్టేజి నిర్మించి ఆర్భాటంగా వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అధికారులకు ప్రైవేటు యాజమాన్య పాఠశాలలపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుందని విమర్శలు వస్తున్నాయి..

 

స్వయంగా DEO గారి అనుమతులతోనే ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతుందని పేర్కొన్న శ్రీ చైతన్య కరస్పాండెంట్.

 

రిపోర్టర్: రవిబాబు అరిగెల, నూజివీడు.

విమర్శలకు తావిస్తున్న విద్యాశాఖ వైఖరి…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *