Top Ad unit 728 × 90

ఇది ఇక్కడితో ముగిసిపోదు. వచ్చే ఏడాది కోసం ఎంతో ఎదురుచూస్తున్నా...!

ఇది ఇక్కడితో ముగిసిపోదు. వచ్చే ఏడాది కోసం ఎంతో ఎదురుచూస్తున్నా...!

ఈ ఏడాది ఎంతో బాగా రాణించానని, తన ఫామ్‌ను వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తానని టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ అన్నాడు. ''ఈ ఏడాది అద్భుతంగా సాగింది. ప్రపంచకప్‌ కూడా గెలిస్తే ఇంకా బాగుండేది. ఇది ఇక్కడితో ముగిసిపోదు. వచ్చే ఏడాది కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. నా ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తా. నా బ్యాటింగ్‌ను అర్థం చేసుకున్నా. ప్రణాళికను అమలు చేయడం ఎంతో ముఖ్యం. బరిలోకి దిగిన తర్వాత సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తూ టాప్‌లో నిలవాలని కోరుకుంటున్నాం. కటక్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎక్కువసేపు బ్యాటింగ్‌ చేయనందుకు కాస్త నిరాశకు గురయ్యాను. కానీ రాహుల్‌, కోహ్లీ అద్భుతంగా ఆడారు. శార్దూల్ ఠాకూర్‌ ఆడిన పుల్‌షాట్‌ను ఎంతో ఆస్వాదించా. జట్టుకు ఆ సమయంలో అది ఎంతో అవసరం'' అని తెలిపాడు.

 

వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక పోరులో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. రోహిత్‌శర్మ 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' దక్కించుకున్నాడు. విశాఖ వన్డేలో శతకంతో (159) చెలరేగిన హిట్‌మ్యాన్‌ ఆఖరి మ్యాచ్‌లోనూ 63 పరుగులతో రాణించాడు. ఈ ఏడాది రోహిత్‌కు ఎంతో ప్రత్యేకమైంది. ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాదడంతో పాటు టెస్టుల్లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. అంతేకాకుండా ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ నిలిచాడు.

భో శంభో శివ శంభో స్వయంభో పాట...!

ప్రతిరోజు ఈ పాట వినండి పరమ శివుని అనుగ్రహం పొందండి...!

శివ పదము మహా అదుతమైన శివుడి పాట...!

కాలభైరవ అష్టకం వినండి కష్టాల నుండి విముక్తులవ్వండి...!

'ఓం' అని శబ్దం చేస్తే దివ్య ప్రకంపనలు ఉద్బవిస్తాయని తెలుసా...!

ఇది ఇక్కడితో ముగిసిపోదు. వచ్చే ఏడాది కోసం ఎంతో ఎదురుచూస్తున్నా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *